News April 15, 2025
విశాఖ: లారీ ఢీకొని మహిళ మృతి

విశాఖలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. టూటౌన్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్య బస్సు కోసం సహోద్యోగి ద్విచక్రవాహనంపై జైలురోడ్డు నుంచి జగదాంబ జంక్షన్‌కి వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటు నుంచి వస్తున్న జీవీఎంసీ గార్బేజ్ లారీ వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న లావణ్య కుడివైపు పడిపోవడంతో ఆమె తలపై నుంచి లారీ వెళ్లింది.
Similar News
News April 23, 2025
విశాఖ: 600కి 598 మార్కులు

పెందుర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన అబ్దుల్ సమీరా భాను బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలల్లో సత్తా చాటింది. 600 మార్కులకు గాను 598 మార్కులు వచ్చాయి. పెందుర్తి మండలంలో 598 మార్కులు రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థిని పలువురు అభినందించారు.
News April 23, 2025
నేడు విశాఖ రానున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నేడు విశాఖ రానున్నారు. సాయంత్రం గన్నవరం నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖకు చెందిన చంద్రమౌలికి నివాళులు అర్పిస్తారు. భౌతికకాయం రాత్రి 10గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. చంద్రబాబు విమానాశ్రయంలో మృతదేహాన్ని స్వయంగా స్వీకరించి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చుతారు.
News April 23, 2025
10th RESULTS: మూడో స్థానంలో విశాఖ జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విశాఖ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 28,435 మంది పరీక్ష రాయగా 25,346 మంది పాసయ్యారు. 15,045 మంది బాలురులో 13,288(88.32%) మంది, 13,390 మంది బాలికలు పరీక్ష రాయగా 12,058(90.05%) మంది పాసయ్యారు. 89.14 పాస్ పర్సంటైల్‌తో విశాఖ జిల్లా 3వ స్థానంలో నిలిచింది. గతేడాది 8వ స్థానంలో నిలవగా ఈసారి ఐదు స్థానాలు మెరుగుపడింది.