News October 31, 2025
విశాఖ: లెక్చరర్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య.!

ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి తేజను కాలేజీలోని ఓ మహిళా లెక్చరర్ వేధింపులకు గురిచేశారని మృతుడి కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొన్నిరోజులుగా వేధింపులు ఎక్కువవడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News November 1, 2025
RECORD: T20Iల్లో అత్యధిక పరుగులు

అంతర్జాతీయ T20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ (4,234) నిలిచారు. నిన్న SAతో జరిగిన రెండో T20లో ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత ప్లేయర్ రోహిత్ శర్మ(4,231) పేరిట ఉండేది. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో వరుసగా కోహ్లీ(4,188), బట్లర్(3,869), స్టిర్లింగ్ (3,710) ఉన్నారు. కాగా 2024 T20 WC గెలిచిన అనంతరం రోహిత్, కోహ్లీ T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
News November 1, 2025
హాట్ టాపిక్‌గా సీఎంకు స్వాగతం పలికిన MLA దొంతి సీన్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తుఫాన్ కారణంగా పంటలు, ఆస్తులు దెబ్బతినడంతో పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్‌కి వచ్చారు. సీఎంకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మొదటిసారిగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వరంగల్‌కు సీఎం ఎప్పుడొచ్చినా ఆ కార్యక్రమాల్లో దొంతి కనిపించలేదు. కానీ, మొదటిసారి రావడంపై హాట్ టాపిక్‌గా మారింది.
News November 1, 2025
భద్రకాళి అమ్మారిని దర్శించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ

వరంగల్ కొంగు బంగారమైన భద్రకాళి అమ్మవారిని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు, అధికారులు పాల్గొన్నారు.


