News September 11, 2025

విశాఖ: లొట్టలేసుకుని తింటున్నారా.. జర జాగ్రత్త..!

image

విశాఖలో 500 హోటళ్లు, 1200 వరకు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే వీటిలో ఆహార నాణ్యతపై దృష్టి సారించిన జీవీఎంసీ.. జోన్‌కు రెండు చొప్పున శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు ఏర్పాటు చేసింది. మొత్తం 16 టీంలు నెల రోజులుగా సోదాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు 302 హోటళ్లలో తనిఖీలు చేసి 173 హోటళ్లలో నిల్వచేసిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించి జరిమానాలు విధించింది.

Similar News

News September 11, 2025

గవర్నర్ పదవికి సి.పి.రాధాకృష్ణన్ రాజీనామా

image

నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి.రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. రేపు ఆయన ఉప రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది.

News September 11, 2025

నేపాల్ అల్లర్లు.. ఢిల్లీలో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!

image

నేపాల్ అల్లర్ల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఢిల్లీ తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. నేపాల్‌లో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్కారు చర్యలు చేపట్టింది. నేపాల్‌లో ఉన్న మన వాళ్ల గురించి కుటుంబసభ్యులు ఫోన్ చేసి వివరాలుతెలుసుకోవచ్చు. 9871999044, 9643723157, 9949351270 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.

News September 11, 2025

MBNR: పశువుల దొంగల అరెస్టు.. రూ.14.50 లక్షలు స్వాధీనం

image

MBNR(D) నవాబ్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పశువుల దొంగతనాలు చేసిన నలుగురు నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నెల 2న కేసు నమోదు అయిందన్నారు. నవాబ్‌పేట్ పోలీసులు కన్మన్ కల్వ గ్రామ శివారులో నేడు పెట్రోలింగ్ చేస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను, బొలెరో వాహనం అదుపులోకి తీసుకున్నామన్నారు. రూ.14,50,000 విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.