News March 21, 2026

విశాఖ: ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్టు

image

రన్నింగ్ ట్రైన్స్‌లో ల్యాప్‌టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్.ధనంజయ నాయుడు ఆధ్వర్యంలో స్టేషన్‌లో తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కాకినాడకు చెందిన అనంత దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2 లక్షల విలువైన 4 ల్యాప్‌టాప్‌లు, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన చెప్పారు.

Similar News

News April 6, 2026

విశాఖ: శ్రీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

గాజువాక సమీపంలోని శ్రీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో ఓ మహిళ మృతి చెందారు. సోమవారం సాయంత్రం శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన గురుబిల్లి శాంతమ్మను లారీ ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే కిందపడి మృతి చెందారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2026

GVMCలో 79 గ్రామ పంచాయతీల విలీనం లేనట్టే..!

image

విశాఖ జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల 79 గ్రామ పంచాయతీలను GVMCలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే జిల్లాలో 89% పట్టణ, 11% గ్రామీణ ప్రాంతం ఉంది. ఈ 4 మండలాల్లో సుమారు 4-5 లక్షల జనాభా కలరు. 2027 జనాభా గణన తర్వాతే పునర్విభజనకు అవకాశం ఉండటంతో అప్పటివరకు విలీనం ప్రతిపాదనలు అటకెక్కినట్టే తెలుస్తోంది.

News April 5, 2026

క్రెడిట్ చోరీ కోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలు: మంత్రి కొండపల్లి

image

భోగాపురం విమానాశ్రయ క్రెడిట్‌ను వైసీపీ తమదిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కాలంలోనే శంకుస్థాపన జరిగి సుమారు 2,600 ఎకరాల భూసేకరణ పూర్తయిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 300 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేశారని, ఆ నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం చేయలేదని ఆరోపించారు.