News April 1, 2025

విశాఖ వస్తున్న యుద్ధ నౌకలు

image

భారత్, అమెరికా సంయుక్తంగా విశాఖలో ఇవాళ్టి నుంచి టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు చేయనున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ తదితర అంశాల్లో పరస్పర సహకారంలో భాగంగా ఇరు దేశాలు ఈ విన్యాసాలు చేపడుతున్నాయి. 13 రోజుల పాటు బంగాళాఖాతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే 2 యుద్ధ నౌకలు విశాఖకు తరలివస్తున్నాయి. ఇరు దేశాల వైస్ అడ్మిరల్, రియల్ అడ్మిరల్ స్థాయిలో పరస్పర చర్చలు జరగనున్నాయి.

Similar News

News September 18, 2025

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంత్రి సుభాష్ భేటీ

image

వెలగపూడి సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఆయన ఛాంబర్‌లో గురువారం కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. పంచాయితీరాజ్ శాఖతో కార్మికశాఖకు ముడిపడి ఉన్న అంశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంత్రి ప్రస్తావించారు. వీటిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

News September 18, 2025

విశాఖలో 524 ఆక్రమణల తొలగింపు

image

విశాఖలో ఆపరేషన్ లంగ్స్‌లో భాగంగా 524 ఆక్రమణల తొలగించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ లంగ్స్ చేపట్టినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు గురువారం తెలిపారు. జోన్ 1లో 20 ఆక్రమణలు, జోన్-2 90, జోన్ -3లో 42, జోన్ -4 60, జోన్ -5లో 52, జోన్-6లో 86, జోన్ – 7లో 42, జోన్-8లో 67 ఆక్రమణలు తొలగించారు.

News September 18, 2025

శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు: SP

image

జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని SP హర్షవర్ధన్‌రాజు సూచించారు. గురువారం పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో అదనపు SPలు, DSPలు, CI, SIలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణపై పలు సూచనలు చేశారు. కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.