News November 1, 2024
విశాఖ-విజయవాడ మధ్య జన్ సాధారణ్ రైళ్లు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. విశాఖ- విజయవాడ-విశాఖ మధ్య జన్ సాధారణ్ రైళ్లను(అన్ రిజర్వుడు) శుక్రవారం నుంచి నడుపుతున్నారు. విశాఖ -విజయవాడ-విశాఖ మధ్య 1,3,4,6,8,10,11,13 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం, స్టేషన్ల మీదుగా నడుస్తాయన్నారు.
Similar News
News November 1, 2024
VZM: ఈనెల 10న డీఎస్సీ ఉచిత శిక్షణకు స్కీనింగ్ పరీక్ష
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నవంబర్ 3న జరగాల్సిన స్క్రీనింగ్ పరీక్షను నవంబర్ 10న నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఉప సంచాలకులు బి.రామనందం శుక్రవారం తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్ నమోదు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి ఎంపికైన వారికి 3 నెలల పాటు ఉచిత భోజన, వసతులు కల్పించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.
News November 1, 2024
VZM: టీచంగ్, నాన్ టీచింగ్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల
KGBVలో టీచింగ్, నాన్-టీచింగ్ (అకౌంటెంట్, వార్డెన్) పోస్టుల్లో అన్ని కేటగిరీలకు సంబంధించి మెరిట్ లిస్ట్‌ను తయారు చేసినట్లు జిల్లా ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ యు.మాణిక్యం నాయుడు తెలిపారు. Vizianagaram.ap.gov.in వెబ్సైట్‌లో ఈ మెరిట్ లిస్ట్‌ను పొందుపరిచామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 2వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా సమగ్ర శిక్షణా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News November 1, 2024
విజయగనరంలో సీఎం చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఇదే
నవంబర్ 2న విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీకాకుళం పర్యటన అనంతరం ఉ.11:10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో గంగచోళ్లపెంటలో ల్యాండ్ అవుతారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధుల, అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 12:05 గంటల నుంచి 12:25 గంటల వరకు రోడ్ల గుంతల పూడ్చివేత ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 నుంచి 12:45 వరకు మీడియాతో మాట్లాడి.. అనంతరం విశాఖ వెళతారు.