News April 2, 2024
విశాఖ: విద్యార్థిని మృతి కేసులో ఐదుగురు అరెస్టు

కొమ్మాదిలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 28న విద్యార్థిని మృతి కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ నిర్వహించినట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ ఎన్.శంకర్రావు, మేనేజ్మెంట్ సిబ్బంది శంకర్ వర్మ, కళాశాల ప్రిన్సిపల్ జి.భాను ప్రకాష్, హాస్టల్ వార్డెన్ వి.ఉషారాణి, ఆమె భర్త ప్రదీప్ కుమార్ ఉన్నారని పేర్కొన్నారు.
Similar News
News January 29, 2026
ఏయూలో భారీ సంగీత సమ్మేళనం.. ఎప్పుడంటే?

ఆంధ్ర విశ్వవిద్యాలయం యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 31న భారీ సంగీత సమ్మేళనం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ బుధవారం ఆవిష్కరించారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏయూ ఓపెన్ ఎయిర్ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల కళా నైపుణ్యాన్ని చాటేలా ఈ వేడుకను ఏర్పాటు చేసినట్లు వీసీ పేర్కొన్నారు.
News January 29, 2026
విశాఖ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

విశాఖ విమానశ్రయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా అరకులో నిర్వహించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం హాజరయ్యేందుకు ముందుగానే విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు స్వాగతం పలికారు. బీచ్ తీరంలో ఉన్న హోటల్‌కు ఆయన చేరుకున్నారు.
News January 28, 2026
విశాఖ: 31న పిల్లలకు ఆటల పోటీలు

విశాఖ ఉత్సవాల్లో భాగంగా 31న మద్దిలపాలెం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో 6 నెలల నుంచి 10 ఏళ్లలోపు పిల్లలకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. 6-13 నెలల చిన్నారులకు పాకడం, 13 నెలల నుంచి 10 ఏళ్ల పిల్లలకు రన్నింగ్, 2-7 ఏళ్ల వారికి జంపింగ్ పోటీలు ఉంటాయి. అలాగే 4-10 ఏళ్ల వారికి స్కేటింగ్, 3-10 ఏళ్ల పిల్లలకు రింగ్ హోల్డింగ్ పోటీలు నిర్వహిస్తారు. Futureolympians.com వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి.


