News June 17, 2024

విశాఖ: విమానాశ్రయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం

image

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత విశాఖ వచ్చిన పల్లా శ్రీనివాసరావుకి విమానాశ్రయంలో పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన శ్రీనివాసరావుకు తాతయ్యబాబు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 7, 2025

విశాఖ: ఎయిర్‌పోర్ట్ రహదారిలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

షీలానగర్ నుంచి ఎన్ఏడీ వైపు వస్తున్న రహదారిలో శుక్రవారం యాక్సిడెంట్ జరిగింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాలపై ఆరా తీస్తున్నారు.

News November 7, 2025

విశాఖ కలెక్టరేట్లో వందేమాతరం వేడుకలు

image

విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం వందేమాతరం గీతాన్న ఆలపించారు. బంకించందర చటర్జి వందేమాతరాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో పాటు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఉన్నతాధికారితో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వందేమాతర గీతం స్వతంత్ర్య స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు.

News November 7, 2025

ఆనందపురం: అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్ మృతి

image

ఆనందపురం మండలం నేలతేరు గ్రామానికి చెందిన కడియం కనకరాజు (53) గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న అతను ఆనందపురం గ్రామంలోని కోళ్ల ఫారం షెడ్ నిర్మాణానికి వెళ్లగా అక్కడ మృతి చెందాడు. మొదట సహజ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు తర్వాత అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.