News December 25, 2025
విశాఖ: విహారయాత్రకు సిద్ధమవుతున్న కార్పొరేటర్లు

మరో 3 నెలల్లో విశాఖ కార్పొరేటర్ల పదవీ కాలం ముగుస్తుంది. ఈ క్రమంలో కార్పొరేటర్లు స్టడీ టూర్ పేరిట FEBలో మరోసారి యాత్రకు సిద్ధమవుతున్నారు. గతేడాది పర్యటన ఖర్చు రూ.2.5కోట్లు. దేశంలో మెరుగైన పనితీరు ఉన్న కార్పొరేషన్లలో విధానాల అమలును పరిశీలించడం ఈ టూర్‌ల ఉద్దేశం. మరి ఏం పరిశీలించారు? ఇక్కడ ఏం అమలు చేశారన్నది తెలియని పరిస్థితి. ఈసారి పదవీకాలం ముగిసే ముందు చేసే ఈ టూర్‌తో ఏం ఉద్దరిస్తారో? మీ కామెంట్.
Similar News
News December 26, 2025
మామిడిలో మంచి పూతకు నిపుణుల సూచనలు

మామిడిలో పూమొగ్గలను ఉత్తేజపరిచి త్వరగా పూత తెప్పించడానికి, ఆడపూల శాతం పెంచడానికి లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 10గ్రా., లీటరు నీటికి బోరాన్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి. పూమొగ్గ దశలో తేనెమంచు పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5ml కలిపి పూత మొదలయ్యే సమయం, పిందెలు తయారయ్యే సమయంలో పూత, ఆకులపైనే కాకుండా మొదళ్లపైన, కొమ్మలపైన కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News December 26, 2025
కేయూ పరిధిలో ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రేపటి నుంచి జరగాల్సిన ఎంబీఏ, ఎంసీఏ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. యూజీసీ నెట్, టీజీసెట్, టీజీటెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.
News December 26, 2025
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో 150 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

<


