News September 30, 2024
విశాఖ వేదికగా క్రికెట్ మ్యాచ్

రంజీ ట్రోఫీలో ఆడే ఆంధ్ర జట్టుకు రికీ బుయ్ మరోసారి నాయకత్వం వహించనున్నారు. వచ్చేనెల 11న తొలి మ్యాచ్‌లో విదర్బతో ఆంధ్ర జట్టు తలపడనుంది. 18న గుజరాత్‌తో, 26న హిమాచల్ ప్రదేశ్‌తో ఆంధ్ర జట్టు ఆడనుంది. విశాఖ వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్ జరగనుంది. విశాఖ ప్లేయర్ రికీ బుయ్ కెప్టెన్‌గా, షేక్ రషీద్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.
Similar News
News December 19, 2025
ఏపీ ఈపీడీసీఎల్‌కు జాతీయస్థాయి అవార్డు

పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్–2025లో ‘భారతరత్న శ్రీ అటల్ బీహారీ వాజపేయి జాతీయ అవార్డు’ను ఏపీఈపీడీసీఎల్ సాధించింది. 23 వేల గిరిజన కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందించిన సేవలకు ఈ గుర్తింపు లభించిందని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు.
News December 18, 2025
కేజీహెచ్‌లో చిన్నారికి అరుదైన వెన్నెముక శస్త్రచికిత్స

అనకాపల్లి జిల్లాకు చెందిన 9 ఏళ్ల తేజస్విని అనే చిన్నారికి విశాఖ కేజీహెచ్ వైద్యులు క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. టీబీ కారణంగా తీవ్ర మెడనొప్పితో బాధపడుతున్న ఆమెకు సుమారు రూ.4 లక్షల విలువైన ఈ చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా అందించారు. న్యూరో సర్జరీ విభాగాధిపతి డా. ప్రేమ్ జిత్ రే బృందం చేసిన ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యిందని సుప్రెండెంట్ వాణి తెలిపారు.
News December 18, 2025
విశాఖ: సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు పరిశీలన చేసిన కమిషనర్

నగరంలోని ముడసర్లోవ, రాడిసన్ బ్లూ హోటల్, సాగర్ నగర్ ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయా ప్రాంతంల్లో పర్యటించి ట్రాక్ పనులపై జీవీఎంసీ ఈఈ, ఇతర అధికారులతో కమిషనర్ చర్చించి సూచనలు చేశారు. అలాగే బీచ్ రోడ్లో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు, మధురవాడలో ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.


