News August 15, 2025

విశాఖ: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

image

విశాఖలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. జ్ఞానాపురంలో నివాసం ఉంటున్న సత్యరాజ్ బైక్ పై మిత్రుడితో కలిసి ఫంక్షన్‌కు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వేములవలస వద్ద అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సాయికుమార్ రోడ్డు దాటుతుండగా మినీ బస్సు ఢీకొని మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News August 15, 2025

విశాఖలో వెలిగిన స్వాతంత్ర్య దీపం.. తెన్నేటి విశ్వనాథం

image

స్వాతంత్ర్య ఉద్యమంలో జ్యోతి తెన్నేటి విశ్వనాథం కీలక పాత్ర పోషించారు. మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి సత్యాగ్రహంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాసేవకు అంకితమయ్యారు. విశాఖ ఎంపీగాను గెలుపొందారు. మద్రాస్ ప్రెసెడెన్సీ నుంచి విడిపోయాక ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటులో ఆయన కృషి నగర వాసులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

News August 15, 2025

స్వాతంత్ర్య దినోత్సవానికి విశాఖ సిద్ధం

image

విశాఖపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల్లో 7 శకటాలు, 8 స్టాళ్లు, 52 మందితో కూడిన పోలీసుల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వివిధ పథకాల లబ్ధిదారులకు మంత్రి రూ.214.99 కోట్ల ప్రోత్సాహకాలను పంపిణీ చేయనున్నారు.

News August 15, 2025

విశాఖ: రెండు రోజుల పాటు మాంసం విక్రయాలు బంద్

image

విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపలు, చికెన్ దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేశ్ కుమార్ గురువారం తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం, కృష్ణాష్టమి సందర్భంగా శనివారం అన్ని మాంసం దుకాణాలను, జంతు వధశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని వ్యాపారులు గమనించాలని ఆయన సూచించారు.