News March 24, 2024
విశాఖ: షిప్‌యార్డులో బెల్జియన్ డ్రెడ్జర్‌కు మరమ్మతులు

బెల్జియన్‌కు చెందిన డ్రెడ్జర్‌కు అనుకున్న సమయం కంటే రెండు రోజుల ముందే మరమ్మతులు పూర్తిచేసి విశాఖలోని షిప్‌యార్డు మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ డ్రెడ్జర్ 150 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు, 21,002 టన్నుల డెడ్ వెయిట్‌తో పాటు 15,000 క్యూబిక్ మీటర్ల వాల్యూమ్, ఒక ఫుల్డ్ డీపీ2 ట్రైలింగ్ సెక్షన్ అప్పర్ కలిగి ఉంది. షిప్‌యార్డులో ఇటువంటి డ్రెడ్జర్‌కు మరమ్మతులు చేయడం ఇదే తొలిసారి.
Similar News
News September 7, 2025
విశాఖ: కారులో మద్యం తాగి వ్యక్తి మృతి

కారులో మద్యం తాగుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మర్రిపాలెంలో చోటు చేసుకుంది. సుఖదేవ్ స్వైన్(53) నేవల్ డాక్ యార్డులో క్లర్క్‌గా పని చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం మర్రిపాలెంలో మద్యం దుకాణం వద్ద మందు కొని కారులో తాగాడు. సాయంత్రం వరకు కారు అక్కడే ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు పరిశీలించి మృతి చెందిన్నట్టు గుర్తించారు. మృతుడు ప్రస్తుతం విమాన్ నగర్‌లో ఉంటున్నాడు.
News September 7, 2025
విశాఖ జిల్లా కోర్టులో ఈ-సేవా కేంద్రం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు విశాఖ జిల్లా కోర్టులో ఈ-సేవా కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. డిజిటల్ సేవల ద్వారా న్యాయం అందరికీ చేరువ కావడమే దీని లక్ష్యంగా పేర్కొన్నారు. కేసు స్థితి, విచారణ తేదీలు, వీడియో కాన్ఫెరెన్స్ సదుపాయం, ఉచిత న్యాయ సేవల మార్గనిర్దేశం వంటి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రారంభోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయమూర్తులు హాజరయ్యారు.
News September 6, 2025
విశాఖ: ‘ఈనెల 25 లోపు అందుబాటులోకి గ్లాస్ బ్రిడ్జి’

కైలాసగిరి పై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని ఈనెల 25వ తేదీ లోపు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని VMRDA ఛైర్మన్ గోపాల్ తెలిపారు. ఇటీవల కైలాసగిరి పై త్రిశూలం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామన్నారు. ఇప్పటికే ప్రారంభించిన పారా సైక్లింగ్ గ్లైడింగ్‌లకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. త్రిశూలం ప్రాజెక్టు రూ.5.50 కోట్లు, గ్లాస్ బ్రిడ్జి రూ.7కోట్లతో చేపట్టామన్నారు.