News January 8, 2026

విశాఖ: సంక్రాంతి తర్వాత.. మరో 3 రోజులు పండగే!

image

విశాఖ వేదికగా తారల క్రికెట్ పండగకు రంగం సిద్ధమైంది. ACA-VDCA స్టేడియంలో జనవరి 16, 17, 18 తేదీల్లో CCL 2026 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా జనవరి 16న మధ్యాహ్నం 2 గంటలకు పంజాబ్ vs కర్ణాటక, సాయంత్రం 6:30కు మన తెలుగు వారియర్స్ vs భోజ్‌పురి దబాంగ్స్ తలపడతాయి. 17, 18 తేదీల్లో ముంబై, బెంగాల్, చెన్నై జట్లు ఆడే మ్యాచ్‌లతో ఈ వారాంతం విశాఖలో సందడి నెలకొననుంది.

Similar News

News February 12, 2026

సిరిసిల్ల : ఓట్ల లెక్కింపునకు 250 మంది పోలీసులతో బందోబస్తు

image

సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మహేష్ బీ గీతే తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, సభలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమలు ఉన్నందున ఆంక్షలు పాటించాలని సూచించారు.

News February 12, 2026

3 రౌండ్లలో నారాయణపేట మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు

image

నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించగా, ఫిబ్రవరి 13న ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం రెండు కౌంటింగ్ హాళ్లలో నాలుగు టేబుళ్ల చొప్పున మొత్తం ఎనిమిది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌లో 8 వార్డుల చొప్పున మూడు రౌండ్లలో మొత్తం 24 వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు.

News February 12, 2026

కృష్ణా: పన్నుల కలెక్షన్‌లో వెరీ పూర్..!

image

గ్రామ పంచాయతీ పన్నుల వసూళ్లలో NTR, కృష్ణా జిల్లాలు వెనుకబడ్డాయి. NTR జిల్లా 34% వసూళ్లతో రాష్ట్రంలో 19వ స్థానంలో ఉండగా, కృష్ణా జిల్లా 41%తో 12వ స్థానంలో నిలిచింది. రెడ్డిగూడెం, గంపలగూడెం వంటి మండలాల్లో వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయి. డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చినా ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత ఏర్పడి అభివృద్ధి కుంటుపడుతోంది.