News August 27, 2025

విశాఖ: ‘సారీ నేను బతకలేను’

image

పెదగంట్యాడలో బాలిక అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు న్యూపోర్ట్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న బాలిక (13) ఇంటి నుంచి వెళ్లిపోతూ చీటీ రాసింది. అందులో ‘నన్ను వెతకొద్దు, మమ్మీ నాకు చచ్చిపోవాలని ఉంది. ఇన్ని రోజులు చాలా భరించాను. ఇప్పుడు నేను ఇంక దీన్ని భరించలేను. సారీ, గుడ్ బై, నేను ఇంకా బ్రతకను’ అని రాసి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News August 27, 2025

ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో ‘కవచ్’ లోకోను ప్రారంభించిన DRM

image

విశాఖ ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో మంగళవారం ‘కవచ్’ లోకోను DRM లలిత్ బొహ్రా జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైలు ప్రమాదాలను నివారించడానికి స్వదేశీ పరిజ్ఞానంతో
‘కవచ్’ వ్యవస్థ రూపొందించినట్లు పేర్కొన్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీ కొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు.

News August 27, 2025

విశాఖ: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాందుడుకి విశాఖ స్పెషల్ పోక్సోకోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 2024లో భీమిలి మండలానికి చెందిన సరగడ సన్యాసిరావు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నేరం రుజువుకావడంతో కోర్టు పై విధంగా శిక్ష విధించింది. బాధిత బాలికకు రూ.3 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.

News August 27, 2025

విశాఖలో సీఎం పర్యటన ఖరారు

image

సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది. 29న సీఎం విశాఖ రానున్నారు. ఉదయం 11.15కి విశాఖ నావెల్ కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.45 వరకు నోవాటెల్‌లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌కి హాజరవుతారు. మధ్యాహ్నం 1.15 నుంచి 3.45 వరకు రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో గ్రిఫిన్ ఫౌండేషన్ నెట్ వర్క్ మీటింగ్‌లో పాల్గొంటారు. సా. 4.20కి విశాఖ నుంచి బయలుదేరి వెళ్తారు.