News January 10, 2025

విశాఖ- సికింద్రాబాద్ వందే భారత్‌కు అదనంగా నాలుగు కోచ్‌లు

image

విశాఖ- సికింద్రాబాద్ (20833/34)వందే భారత్ రైలుకు అదనంగా నాలుగు కోచ్‌లు ఏర్పాటు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. జనవరి 11 నుంచి వందే భారత్ రైలు 20 కోచ్‌లతో నడుస్తుందన్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ -2, చైర్ కార్ -18 బోగీలు ఉండనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Similar News

News February 20, 2026

16 ఏళ్ల తర్వాత ‘IONS’ పీఠంపై భారత్

image

విశాఖపట్నంలో జరిగిన 9వ అయాన్స్ సదస్సులో 33 దేశాలు పాల్గొన్నాయి. 16 ఏళ్ల తర్వాత భారత నౌకాదళం ఈ ప్రతిష్ఠాత్మక పీఠాన్ని దక్కించుకుంది. నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి అధ్యక్షతన సముద్ర భద్రత, సమాచార మార్పిడి, విపత్తు నిర్వహణలో సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. అప్‌గ్రేడ్ చేసిన వెబ్‌సైట్, సముద్ర విన్యాసాల ద్వారా అంతర్జాతీయ నౌకాదళాల మధ్య ఐక్యతను చాటారు.

News February 20, 2026

విశాఖ ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 అమలు

image

విశాఖపట్నం ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏపీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు విధించినట్లు ఏసీపీ కె.లక్ష్మణ మూర్తి తెలిపారు. కలెక్టరేట్, జీవీఎంసీ, జగదాంబ వంటి కీలక ప్రాంతాల్లో అనుమతి లేకుండా సభలు, ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 20, 2026

కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్‌లో విధులు నిర్వహించేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న బోయన్న (53) జాతీయ రహదారిపై లారీ కింద పడి దుర్మరణం చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.