News April 24, 2024

విశాఖ: సీఎం జగన్ యాత్ర.. రూట్ మ్యాప్ ఇదే

image

సీఎం జగన్ ఈరోజు ఉ.9 గంటలకు ఎంవీవీ సిటీ నుంచి బయలుదేరతారు. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత బొద్దవలస మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చెల్లూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని వైసీపీ నాయకులు తెలిపారు.

Similar News

News April 22, 2025

సింహాచలంలో ఏప్రిల్ 27న గంధం అమావాస్య వేడుకలు

image

సింహాచలం వరహాలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 27న గంధం అమావాస్య వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో సుబ్బారావు సోమవారం తెలిపారు. ఈనెల 26 సాయంత్రం నుంచి భక్తులు కొండ కింద వరాహ పుష్కరిణి వద్ద జాగరము ఉండి స్నానమాచరించి స్వామి వారి దర్శనము చేసుకొని వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఏప్రిల్ 28 నుంచి మే2 వరకు ఆలయంలో తిరునక్షత్ర మహోత్సవము నిర్వహించనున్నారు. పైతేదీలలో అన్ని రకాల సేవలు రద్దు చేశారు.

News April 22, 2025

K.G.Hలో టీచర్లకు వైద్య శిబిరాలు 

image

బదిలీల్లో ప్రాధాన్యత క్యాటగిరీ కిందకు వచ్చే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 24 నుంచి 26 వరకు K.G.Hలో ప్రత్యేక వైద్య శిబిరానికి హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ కోరారు.‌ 24న విశాఖ, 25న అనకాపల్లి, 26న అల్లూరి జిల్లాలకు చెందినవారు వైద్య శిబిరాలకు హాజరు కావాలన్నారు. ఈ శిబిరంలో పొందిన సర్టిఫికెట్ల ఆధారంగా కేటగిరీలను వర్గీకరిస్తామని తెలిపారు.

News April 21, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 113 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 113 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. ప్రజలు నుంచి నేరుగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులు ఫిర్యాదులను పరిశీలించి అర్జీదారులతో స్వయంగా మాట్లాడాలని ఆదేశించారు. ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని చట్టపరంగా సమస్య పరిష్కారించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు.

error: Content is protected !!