News April 24, 2024
విశాఖ: సీఎం జగన్ రేపు బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే..

ఎండాడ బస కేంద్రం నుంచి మంగళవారం సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకొని అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. తర్వాత తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. అక్కడ భోజనం విరామం తర్వాత బొడ్డువలస మీదుగా సాయంత్రం చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస చేరుకొని రాత్రి బస చేస్తారు.
Similar News
News September 16, 2025
ఏయూ: LAW కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్

ఈ విద్యాసంవత్సరానికి గానూ విశాఖలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ LAW లో కోర్సులకు ఏయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 ఏళ్ల LLB, 3 ఏళ్ల LLB, 2 ఏళ్ల పీజీ LLM కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ అడ్మిషన్లు కలవు. సెప్టెంబర్ 27వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. LAWCET/CLAT క్వాలిఫైడ్ విద్యార్థులకు ప్రాధాన్యం.
News September 16, 2025
విశాఖ: వృద్ధురాలిని మోసం చేసిన కేసులో ముగ్గురి అరెస్టు

వృద్ధురాలి డబ్బులు దోచేసిన ముగ్గురిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్ నగర్లో ఉంటున్న వృద్ధురాలికి ఈ ఏడాది మే 16న ఫోన్ చేసి బంధువులుగా పరిచయం చేసుకున్నారు. ఆమె నుంచి ధఫదపాలుగా రూ.4 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. డబ్బలు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బ్యాంక్ ఖాతాల ఆధారంగా రాజస్థాన్‌కి చెందిన మొయినుద్దీన్, గణేశ్, దినేశ్‌ను పట్టుకున్నారు.
News September 16, 2025
నేటి నుంచి జీవీఎంసీ కార్పొరేటర్ల అధ్యయన యాత్ర

జీవీఎంసీ కార్పొరేటర్లు మంగళవారం అధ్యయన యాత్రలో పాల్గొననున్నరు. ఈ ప్రయాణంలో భాగంగా రేపు జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించనున్నారు. అనంతరం ఆజ్మీర్, జోద్పూర్ నగరాల్లో పర్యటించి పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తారు. కార్పొరేటర్ల బృందం ఈనెల 24న తిరిగి విశాఖకి చేరుకుంటుంది.