News December 25, 2024
విశాఖ: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జేసీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నావికాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు జనవరి 4న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, నేవీ కమోడర్ మోహన్ పరిశీలించారు. సీఎం సభాస్థలికి చేరుకునే దగ్గరనుంచి తిరుగు ప్రయాణం అయ్యేవరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఎయిర్‌పోర్ట్ నుంచి ఎన్సీబీ మీదుగా ఆర్కే బీచ్‌కు చేరుకుంటారని తెలిపారు.
Similar News
News December 26, 2024
విశాఖ హనీట్రాప్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
విశాఖ హనీట్రాప్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ బుధవారం తెలిపారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా ఉస్మాన్ చౌదరి, ఆమె భర్త తన్వీర్, అవినాశ్, వారి స్నేహితుడు బెంజిమన్ పాత్ర ఉన్నట్లు రుజువు కావడంతో వారిని కంచరపాలెం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరు జాయ్ జమీమా బృందానికి మత్తుమందులు, స్ప్రేలు సరఫరా చేసేవారని పేర్కొన్నారు.
News December 26, 2024
విశాఖ: పలు రైళ్లకు అదనపు కోచ్‌లు
సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డిఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ పాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.
News December 26, 2024
విశాఖ: గ్యాస్ లీక్.. లైట్ వెయ్యగానే వ్యాపించిన మంటలు..!
పాతడెయిరీ ఫారం ఇందిరాగాంధీ నగర్‌లో గ్యాస్ లీకై మంటలు చెలరేగి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అప్పారావు, సత్యవతి, రాజశేఖర్, చంద్రశేఖర్ గాయపడ్డారు. వీరిని విమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా.. రాత్రి 8 గంటల సమయంలో బయటకు వెళ్లిన వీరు తిరిగి వచ్చే ఇంటి మొత్తం గ్యాస్ లీకై వ్యాపించింది. నాగరాజు లైట్ వెయ్యగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం.