News March 23, 2024

విశాఖ: ‘సీఎం, మంత్రుల ఫోటోలు ఉండకూడదు’

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలుచేయాలని జిల్లా ఎన్నికల అధికారి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆర్.ఓలను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి జారీ చేయబడే విద్యుత్, తాగునీరు, ఇతర బిల్లులపై ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ ప్రతినిధుల ఫొటోలు గాని, వారి సందేశాలు గాని ఉండకూడదని స్పష్టం చేశారు.

Similar News

News January 9, 2025

టీటీడీ చరిత్రలో నిన్న ఒక బ్లాక్ డే: గుడివాడ 

image

తిరుపతిలో జరిగిన ఘటన దురదృష్టకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ వైసీపీ ఆఫీసులో గురువారం మాట్లాడారు. టీటీడీ చరిత్రలో నిన్న ఒక బ్లాక్ డే అన్నారు. అధికార యంత్రాంగం, టీటీడీ విజిలెన్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి, గాయపడ్డ వారికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించామని గుర్తు చేశారు.

News January 9, 2025

వీసీ ఎంపికకు ఏయూ సెర్చ్ కమిటీ

image

ఏయూ వైస్ ఛాన్సలర్ ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ఎన్ఐపిఈఆర్ డైరెక్టర్ యుఎస్ఎన్ మూర్తి, ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తరఫున ముంబైలోని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ ఎస్.మహేంద్ర దేవ్, యూజీసీ నుంచి కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ వీసీ బి.సత్యనారాయణను నియమించింది.

News January 9, 2025

ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక తీరనుంది: సీఎం

image

విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక తీరనుందని CM చంద్రబాబు పేర్కొన్నారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. మరో వైపు అనకాపల్లి జిల్లాలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయని చెప్పారు. అరకు కాఫీని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసి ఒక బ్రాండ్ తీసుకొచ్చారన్నారు. విశాఖ ఏపీకి ఆర్థిక రాజధానిగా ఎదుగుతుందని CM చెప్పుకొచ్చారు.