News August 27, 2024
విశాఖ సీపీ చొరవతో బస్సు సౌకర్యం

విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చొరవతో 77వ వార్డు నమ్మి దొడ్డి జంక్షన్‌కు బస్ సౌకర్యం కలిగింది. ఇటీవల సీపీ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో వారి సమస్యలు తెలుసుకున్నారు. నమ్మిదొడ్డి ప్రాంతానికి బస్సు సౌకర్యం లేదని ప్రజలు సీపీకి తెలియజేయడంతో తక్షణమే స్పందించి ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌తో మాట్లాడారు. దీంతో సోమవారం గాజువాక డిపో నుంచి నమ్మి దొడ్డి జంక్షన్ వరకు బస్సును ప్రారంభించారు.
Similar News
News September 22, 2025
సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో తగ్గనున్న ధరలు

సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో నేటి నుంచి నూతన జి.ఎస్.టి అమలు చేయనున్నట్లు సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తెలిపారు. రూ.1000 నుంచి రూ.2500 విలువ గల వస్త్రాలపై 12%గా ఉన్న జి.ఎస్.టి 5%గా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నూతన జి.ఎస్.టి విధానం అమలుతో 6.25% వినియోగదారులకు లాభం చేకూరుతుందన్నారు.. వినియోగదారులు గమనించాలన్నారు.
News September 22, 2025
విశాఖ పోలీసులకు ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు

విశాఖ పోలీసులకు అరుదైన గౌరవం దక్కింది. రోడ్డు ప్రమాద బాధితులకు విశాఖ సీపీ ఏర్పాటు చేసిన తక్షణ సహాయ కేంద్రంకు స్కోచ్ అవార్డు లభించింది.ఈ అవార్డును సెప్టెంబర్ 20న విశాఖ పోలీసులకు ప్రధానం చేసినట్లు విశాఖ సిపి శంక బ్రత బాగ్చి ఆదివారం ప్రకటనలో విడుదల చేశారు. భారతదేశమైన మొట్టమొదటిసారిగా రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించడం పట్ల అవార్డు దక్కిందని పేర్కొన్నారు.
News September 22, 2025
విశాఖలో 2,476 ఆక్రమణలు తొలగింపు

ఆపరేషన్ లంగ్స్ 2.0లో భాగంగా ఆదివారం ఒక్కరోజే 717 ఆక్రమణలు తొలగించినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకరరావు తెలిపారు. నాలుగు రోజుల్లో మొత్తం 2,476 ఆక్రమణలు తొలగించినట్లు వెల్లడించారు. ప్రధానంగా తగరపువలస, మిథిలాపురి, కొమ్మాది, పెదగదిలి, ఆర్‌టీసీ కాంప్లెక్స్, జగదాంబ, దొండపర్తి, గాజువాక, వడ్లపూడి, నెహ్రూ చౌక్, ప్రహలాదపురం తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో ఆక్రమణలు తొలగించినట్లు పేర్కొన్నారు.