News July 3, 2024

విశాఖ: సీబీసీఎస్సీ స్థలంలో తవ్వకాలపై గనుల శాఖ ఆరా

image

సిరిపురం కూడలి సమీపంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఎంవీవీ పీక్ ప్రాజెక్టులో జరిపిన తవ్వకాలపై గనుల శాఖ ఆరా తీసింది. అనుమతులు పొందిన ప్రాంతంలో ప్రత్యేక పరికరాలతో సర్వే నిర్వహించి అనుమతులు పొందిన దాని కంటే ఎక్కువగా తవ్వకాలు జరిపినట్లు తేల్చారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సంబంధిత ప్రాజెక్టు ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు. కాగా కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారు.

Similar News

News July 5, 2024

విశాఖ: డీసీఐకి రూ.156.5 కోట్లతో ఒప్పందం

image

ప్రతిష్ఠాత్మకమైన కొచ్చిన్ పోర్టు అథారిటీ‌తో రూ. 156.50 కోట్ల విలువైన డ్రెడ్జింగ్ ఒప్పందం కుదిరినట్లు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఛైర్మెన్ అంగముత్తు తెలిపారు. డ్రెడ్జింగ్ పరిశ్రమల్లో డీసీఐ అగ్రగామిగా ఉందన్నారు. భారీస్థాయి డ్రెడ్జింగ్ ప్రాజెక్టులను అమలు చేయడంలో మంచి రికార్డు ఉందని వెల్లడించారు. ఈ ఒప్పందం డీసీఐ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News July 5, 2024

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నుంచి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్.చంద్రకళ తెలిపారు. ఆన్లైన్లో అర్హతలు, వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. జులై 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 5, 2024

విశాఖ జూకు చేరిన కొత్త అతిథులు

image

విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు గుజరాత్‌లోని జామ్‌న‌గర్ రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి గ్రీన్ వింగ్ మకావ్, స్క్విరెల్ మంకీస్ తదితర వాటిని జంతువులు వచ్చాయి. గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో ఇవి విశాఖకు చేరుకున్నాయి. జంతువులను పరస్పరం మార్చుకునే విధానంలో ఇక్కడకు జంతువులను తీసుకువచ్చారు. కొత్త జంతువులను కొద్దికాలం క్వారంటైన్ అనంతరం సందర్శకులకు అందుబాటులో ఉంచుతారు.