News February 28, 2025
విశాఖ: సెల్ఫీకి నేను రెఢీ.. మరి మీరు రెఢీనా..!

వన్యప్రాణుల హావభావాలను మంత్రముగ్ధులు కాని వారు ఎవరూ ఉండరు. మానవ నేస్తాలుగా వన్యప్రాణులు వ్యవహరిస్తూ విశాఖ జూపార్క్‌లో ఒక సాంబార్ డీర్ అందరినీ ఆకట్టుకుంటుంది. కళాశాల విద్యార్థులు,సందర్శకులు దీనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. సెల్ఫీ ఇవ్వడానికి నేను రెఢీ.. మరి మీరు రెఢీనా అన్నట్లుగా ఏమాత్రం భయం లేకుండా ఆ సాంబార్ డీర్ సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది. ఇలాంటి దృశ్యాలు ఎన్నో జూలో సాక్షాత్కరిస్తాయి.
Similar News
News February 28, 2025
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్ళు రద్దు

రైల్వే నాన్ -ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్ళను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖ – గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్‌ను (17239/40) మార్చి 1,2,3 తేదీలలో, విశాఖ -గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్(22701/02) మార్చ్ 2న, విశాఖ – లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్(12805/06)మార్చ్ 2న, తిరుగు ప్రయాణంలో మార్చి 3న రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణీకులు గమనించాలన్నారు.
News February 28, 2025
వీఈఆర్‌లో మౌలిక సదుపాయాలపై చర్చ

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) పరిధిలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర, పూర్వ తూర్పుగోదావరి జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల కలెక్టర్లతో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ వర్చువల్ సమావేశంలో చర్చించారు. వీఎంఆర్డీఏ కార్యాలయం నుంచి ఈసమావేశంలో నీతి ఆయోగ్ పథక సంచాలకులు పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ కిషోర్, వీఎంఆర్డీఏ ఎంసీ విశ్వనాథన్ పాల్గొన్నారు.
News February 28, 2025
‘విశాఖను ప్రథమ స్థానంలో నిలపండి’

విశాఖలో 2024 స్వచ్ఛ సర్వేక్షన్‌లో ప్రథమ స్థానంలో నిలపాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్ సోమనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం జోన్ -3 ఆఫీసులో అధికారులతో సమావేశమయ్యారు. విశాఖలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నేరుగా ముఖాముఖిగా, స్వచ్ఛత యాప్, వెబ్సైట్ లింకు ద్వారా సేకరించడం జరుగుతుందన్నారు. విశాఖ నగర అభివృద్ధికి, నగరాన్ని దేశంలోనే ప్రథమ స్థానం లక్ష్యసాధనకు ప్రజలుకు అవగాహన కల్పించాలన్నారు.