News February 27, 2026

విశాఖ: సైబర్ నేరాలకు అడ్డాగా మ్యూల్ ఖాతాలు

image

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఏజెంట్లు కమీషన్ ఆశ చూపించి వారి పేర్లపై మ్యూల్ ఖాతాలు తెరిపిస్తున్నారు. ఈ ఖాతాల ద్వారానే సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించి విదేశాలకు తరలిస్తున్నారు. బాధితులు ఆలస్యంగా ఫిర్యాదు చేస్తే నిధుల రికవరీ కష్టమవుతోంది. మ్యూల్ ఖాతాలు సరఫరా చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో 400 మంది అకౌంట్‌దారులను అరెస్టు చేశారు.

Similar News

News March 2, 2026

విశాఖలో యువకుడి ఆత్మహత్య

image

కూర్మన్నపాలెం సమీపంలో గల మంగళపాలెం జెఎన్‌ఎమ్‌ఆర్ దగ్గర టిట్కో ఇంట్లో సోమవారం యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్లంబింగ్ పనులు చేయడానికి ఒడిశా నుంచి వచ్చిన అభినాష్ ప్రధాని (21) అనే యువకుడు ఉరిపోసుకొన్నాడు. ఈ ఘటనపై దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 2, 2026

బాల్య వివాహాల నిర్మూలనకు ‘విముక్తి రథం’

image

కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో బాల్య వివాహాల విముక్తి రథాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రథం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో పర్యటిస్తూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తుందని వారు తెలిపారు. ఆడపిల్లలను చదువు ద్వారా ప్రయోజకులను చేయాలని, చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను నాశనం చేయవద్దని కోరారు.

News March 2, 2026

మార్చి 10న మెగా జాబ్ మేళా.. పోస్టర్ ఆవిష్కరణ

image

ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా సందర్భంగా వన్ టౌన్ సీఐ బి.సునీల్ కుమార్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. మార్చి 10న ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జరగనున్న ఈ జాబ్ మేళాలో 50కిపైగా కంపెనీలు పాల్గొని 2000కుపైగా ఉద్యోగాలు కల్పించనున్నాయి. నిరుద్యోగ యువతీయువకులు గూగుల్ ఫారమ్ QR Code లింక్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.