News March 1, 2025
విశాఖ: సోదరి ఇంటికి వెళ్తూ ప్రమాదంలో మహిళ మృతి

విశాఖ సెంట్రల్ జైల్ సమీపంలో ఎస్ఎస్ఎ నగర్ ఎదురుగా బిఆర్ఎస్ రోడ్డులో స్కార్పియో వాహనం ఢీకొని గెడ్డం సావిత్రి(62) అనే మహిళ మృత్యువాత పడినట్లు ఆరిలోవ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. రోడ్డు దాటుతుండగా సెంటర్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతురాలు ఆనందపురం గ్రామం కాగా స్థానికంగా ఉన్న సోదరి ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడినట్లు తెలిపారు.
Similar News
News March 2, 2025
విశాఖ: రైలు ప్రయాణికుల భద్రతపై సమావేశం

రైళ్లలో ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక సమావేశం రైల్వే డీఎస్పీ రామచందర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రైల్వే పోలీసులు జీఆర్పీ పోలీసులు హాజరయ్యారు. ముఖ్యమైన రైలు తనిఖీ చేయడమే కాకుండా సీసీ కెమెరాలతో నిఘా మరింత పెంచాలని అనుమానితుల కదలికలు పరిశీలన ఎప్పటికప్పుడు చేయాలని పలు అంశాలపై చర్చ చేశారు. సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
News March 1, 2025
విశాఖపట్నంలో టుడే టాప్ న్యూస్

➤ ఏయూ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన జి.పి.రాజశేఖర్ ➤ ప్రశాంతంగా ప్రారంభమైన మొదటిరోజు ఇంటర్ పరీక్షలు➤ జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలలో 95 % మంది మొదటిరోజు పరీక్షకు హాజరైన విద్యార్థులు➤ KGHలో శిశువులు మార్పిడి.. ఒకరు సస్పెండ్, ఇద్దరికి చార్జీ మెమోలు➤ సింహాచలం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు➤జిల్లా వ్యాప్తంగా మూడు మిస్సింగ్ కేసులు ఛేదించిన పోలీసులు
News March 1, 2025
మార్చి 14న సింహాచలంలో డోలోత్సవం

మార్చి 14న ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా సింహాచలంలో డోలోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ సిబ్బంది శనివారం తెలిపారు. ఆరోజు ఉదయం 6 గంటల నుంచి స్వామివారు ఉత్సవ విగ్రహాలను కొండమీద నుంచి మెట్లు మార్గంలో ఊరేగింపుగా కొండ కింద ఉన్న ఉద్యానవనానికి తీసుకురానున్నట్లు తెలిపారు. మండపంలో డోలోత్సవం, వసంతోత్సవం, చూర్ణోత్సవం నిర్వహించి తిరువీధి ఊరేగింపు చేయనున్నట్లు తెలిపారు. ఆరోజున ఉండే కళ్యాణం రద్దు చేసినట్లు తెలిపారు.