News March 21, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్‌కి షాక్

విశాఖ ఉక్కును విద్యుత్ బిల్లుల గండం మరింత భయపెడుతోంది. బాయిలర్ బొగ్గు కొరతతో ప్లాంట్‌లోని 315 మెగావాట్ల సొంత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఈపీడీసీఎల్ నుంచి విద్యుత్‌ని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిలు రూ.60 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఇవి చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామంటూ ఈపీడీసీఎల్ హెచ్చరిస్తూ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.
Similar News
News April 20, 2025
చందనోత్సవానికి 500 కేజీల చందనం చెక్కలు సిద్ధం

ఏప్రిల్ 30న సింహాచలంలో జరగనున్న చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో సుబ్బారావు ఆదివారం తెలిపారు. ఈనెల 24న మొదటి విడత చందనం అరగదీతను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని కోసం కావాల్సిన 500 కేజీల చందనపు చెక్కలను ఆదివారం సిద్ధం చేశారు. ఈనెల 24 ఉదయం 6:30కు చందనం అరగదీత మొదలవుతుందని, 7:30 తర్వాత దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.
News April 20, 2025
కార్పొరేటర్లను ప్రలోభపెట్టినట్టు నిరూపించాలి: V.M.R.D.A ఛైర్మన్

G.V.M.C.ఎన్నికల్లో కార్పొరేటర్లను ప్రలోభపెట్టినట్టు ఆరోపిస్తున్న వైసీపీ నాయకులు దాన్ని నిరూపించాలని V.M.R.D.A ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ సవాల్ చేశారు. అవిశ్వాసంలో ధర్మబద్ధంగా నెగ్గామన్నారు. గత 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు చేయని అరాచకం లేదని విమర్శించారు. వైసీపీ పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఇకపై జీవీఎంసీని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామన్నారు.
News April 20, 2025
DSC: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ 10 గంటలకు మెగా DSC నోటిఫికేషన్ వెలువడనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ➱SA LANG-1: 26, ➱HINDI: 28, ➱ENG: 55, ➱MATHS: 59, ➱PS: 39, ➱BS: 58, ➱SOCIAL: 91, ➱PE:139, ➱SGT: 239, ➱TOTAL: 734 ఉన్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ➱TEL: 07, ➱HINDI: 11, ➱MATHS:07, ➱PS: 35, ➱SOCIAL:05, ➱SGT: 335, ➱TOTAL:400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.