News December 18, 2025

విశాఖ: స్టీల్ ప్లాంట్‌కు ఇన్‌ఛార్జ్ సీఎండీగా గుప్తా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ అదనపు ఇన్ఛార్జ్ సీఎండీగా మనీష్ రాజ్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సెయిల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత సీఎండీ అతుల్ భట్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకంపై కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, కొత్త నాయకత్వంలో స్టీల్ ప్లాంట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News December 18, 2025

కలెక్టర్ల సద్దస్సులో పాల్గొన్న విశాఖ కలెక్టర్, సీపీ

image

రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు సమావేశంలో విశాఖపట్నం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, సీపీ శంకబ్రత బాగ్చి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులపై చర్చించారు.

News December 18, 2025

సింహాచలం దేవస్థానంలో పది రోజులు ఆర్జిత సేవలు రద్దు

image

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 20 నుంచి 29 వరకు పగల్ పత్తు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.సుజాత గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ తిరువీధి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉత్సవాల కారణంగా ఈ పది రోజుల పాటు నిత్యం జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు.

News December 18, 2025

భీమిలి తీరానికి కొట్టుకు వచ్చిన తాబేలు, డాల్ఫిన్

image

భీమిలి తీరానికి డాల్ఫిన్, తాబేలు కొట్టుకొచ్చాయి. ఇప్పటి వరకు డాల్ఫిన్, ఇతర చేపలు తీరానికి కోట్టుకు రాలేదని జాలర్లు తెలిపారు. కెమికల్ ఫ్యాక్టరీ విడిచి పెడుతున్న వ్యర్ధాల కారణంగా సముద్ర జలాలు కలుషితమయ్యాయని, దీంతో విలువైన మత్స్య సంపద నాశనమౌతోందని వారు ఆవేదన చెందారు. కాలుష్యం వెదజల్లుతున పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.