News September 28, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 4వేల మందిని తొలగిస్తారా.?: అయోధ్యరాం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఒకేసారి 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించిందని స్టీల్ ప్లాంట్ సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు అయోధ్యరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివిధ కార్మిక సంఘాల నాయకులు తీవ్ర నిరసన తెలియజేయడంతో యాజమాన్యం దిగివచ్చిందన్నారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై స్టీల్ ప్లాంట్ అడ్మిన్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేపట్టామన్నారు.
Similar News
News December 21, 2024
విశాఖ: అక్రమంగా అమ్మాయిలను తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
అక్రమంగా 11 మంది అమ్మాయిలను ఒడిశాలోని నవరంగ్‌పూర్ నుంచి చెన్నై ట్రైన్లో తరలిస్తున్న నిందితుడు రవికుమార్‌ను శనివారం అరెస్టు చేశామని విశాఖ రైల్వే సీఐ ధనంజయ నాయుడు తెలిపారు. 11 మందిని పని పేరుతో అక్రమంగా ఆధార్ టాంపర్ చేసి గార్మెంట్‌లో పని కోసం తిమ్మాపూర్ తరలిస్తున్నారని గుర్తించామని అన్నారు. అక్రమ రవాణా, ఆధార్ టాంపరింగ్‌పై సెక్షన్ 143 (5)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
News December 21, 2024
విశాఖలో వర్షం.. మ్యాచ్ రద్దు
విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో భాగంగా శనివారం విశాఖలో జరగాల్సిన ఛత్తీస్‌గఢ్, మిజోరం మ్యాచ్ రద్దు చేశారు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యాహ్నం 12 గంటలకు రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజయ్ హజారే ట్రోఫీలో మొదటి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
News December 21, 2024
మీరు పడే తపన కన్నీళ్లు తెప్పిస్తోంది: పవన్ కళ్యాణ్
అనంతగిరి మండలం బల్లగరువులో రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన అనంతరం Dy.CM పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. వెంటనే అక్కడున్న ప్రజలు నీళ్లు తాగాలని సూచించగా.. ‘మా ఇంట్లో వాళ్లు నా కోసం ఎంత తపన పడతారో తెలీదు కానీ.. మీరు పడే తపన కన్నీళ్లు తెప్పిస్తోంది’ అని అన్నారు. ఐదేళ్లు మీకోసం పని చేస్తానని.. ఈ ఐదేళ్ల తర్వాత ప్రోగ్రస్ రిపోర్ట్ ఇవ్వాలని గిరిజనులకు ఆయన కోరారు.