News December 24, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 3వ విడత VRSకి నోటిఫికేషన్

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 3వ విడత VRS పథకాన్ని యాజమాన్యం బుధవారం ప్రకటించింది. 2027 జనవరి 1వ తేదీ తర్వాత పదవీ విరమణకు అర్హులయ్యే ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. 2026 జనవరి 1-20 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. కనీసం 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి, 45 ఏళ్లు దాటిన ఉద్యోగులు అర్హులు.

Similar News

News December 26, 2025

తుంగతుర్తి: మంత్రి ఉత్తమ్, భట్టిని కలిసిన గుడిపాటి నరసయ్య

image

కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య శుక్రవారం మంత్రి ఉత్తమ్, భట్టి విక్రమార్కను ప్రజా భవన్‌లో కలిశారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా గుడిపాటి నర్సయ్య ఎన్నికైన తర్వాత వారిని కలిశారు. మంత్రులు గుడిపాటికి శుభాకాంక్షలు తెలిపారు.

News December 26, 2025

జగన్ ట్వీట్‌తో రంగా అభిమానుల్లో కొత్త చర్చ!

image

AP: వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా YCP చీఫ్ జగన్ ప్రత్యేకంగా <<18674822>>ట్వీట్‌<<>> చేయడం చర్చకు దారితీసింది. రంగా కుమారుడు రాధా YCPని వీడి గతంలో TDPలో చేరారు. తాజాగా కుమార్తె ఆశాకిరణ్ యాక్టివ్ అయ్యారు. భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని ఓసారి ఆమెను మీడియా అడగ్గా రాధారంగా మిత్రమండలి సలహాతో నడుస్తానన్నారు. ఆమెను పార్టీలో చేర్చుకోవాలని YCP ఆసక్తితో ఉందా? అనే సందేహాలు రంగా అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.

News December 26, 2025

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌(<>EIL<<>>) 5 మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్/బీఎస్సీ(Engg.) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. మేనేజర్‌కు నెలకు రూ.80వేలు-రూ.2,20000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.70వేలు-రూ.2లక్షలు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruitment.eil.co.in