News January 28, 2026

విశాఖ: స్టీల్ ప్లాంట్‌లో VRSకి 850 దరఖాస్తులు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో VRS-3 గడువు నిన్నటితో ముగిసింది. ఏడాది మార్చి, సెప్టెంబర్ నెలల్లో ఇప్పటికే 2 దఫాలు VRS అమలు చేశారు. ఈ క్రమంలో DECలో VRS-3 నోటిఫికేషన్ జారీ చేశారు. మొదట JAN 20 వరకు గడువు విధించి తర్వాత జనవరి 27 వరకు పొడిగించారు. గడువు ముగిసే సరికి సుమారు 850 మంది ఉద్యోగులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇప్పటివరకు 40 మంది ఉపసంహరణకు దరఖాస్తు చేయగా, ఉపసంహరణ గడువు ఈ నెల 30 వరకు ఉంది.

Similar News

News January 29, 2026

విశాఖ నగర వ్యాప్తంగా భూముల విలువల సవరణ

image

రిజిస్ట్రేషన్ల శాఖ విశాఖ నగర వ్యాప్తంగా భూముల విలువలను సవరించింది. అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్ ప్లాట్లకు ప్రతి చదరపు అడుగుకు రూ.100 పెంపు ప్రతిపాదించింది. ప్రస్తుతం చదరపు అడుగు రూ.4,200గా ఉండగా, కొత్తగా రూ.4,300గా నిర్ణయించారు. అయితే కమర్షియల్ ఆస్తుల విషయంలో చదరపు అడుగుకు రూ.100 తగ్గించారు. నిర్మాణాల కాంపోజిట్ రేట్లను కూడా పెంచనున్నారు. ఈ సవరించిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

News January 29, 2026

విశాఖలో ముగిసిన జాతీయ జైళ్ల అధికారుల సదస్సు

image

విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన 9వ జాతీయ కారాగార నిర్వాహకుల సదస్సు గురువారం ముగిసింది. ముగింపు వేడుకలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలు మాత్రమే కాదని, సంస్కరణ నిలయాలుగా మారాలని ఆమె ఆకాంక్షించారు. టెక్నాలజీ వినియోగం, లేబర్ కోడ్ మార్పులు, ఖైదీల పునరావాసంపై సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

News January 29, 2026

విశాఖ: 481 మంది అక్రిడిటేష‌న్ల జారీకి క‌మిటీ ఆమోదం

image

విశాఖలో అర్హులైన జ‌ర్న‌లిస్టులు 481మందికి తొలి విడ‌త‌లో అక్రిడిటేష‌న్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేష‌న్ క‌మిటీ ఆమోదం తెలిపింది. క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అధ్య‌క్ష‌త‌న‌ క‌లెక్ట‌రేట్లో గురువారం స‌మావేశం జ‌రిగింది. జ‌ర్న‌లిస్టుల అర్హ‌త‌లు, అంశాల‌పై చ‌ర్చించారు. 512 మందికి ప్ర‌తిపాదించ‌గా 481కి కమిటీ ఆమోదం ల‌భించింది. ప్రింట్ 287, ఎల‌క్ట్రానిక్ మీడియా 194 ద‌ర‌ఖాస్తులు అర్హ‌త పొందాయి