News September 3, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌ సీఎండీగా శక్తిమణి

image

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ పోస్టుకు న్యూఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్కోర్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.శక్తిమణి ఎంపికయ్యారు. ఈ పోస్ట్‌కు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఈడీ దీప్తెండు కూడా ఇంటర్వ్యూకి హాజరు కాగా అర్హతులను బట్టి శక్తిమణిని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ఎంపిక చేసింది. కాగా ప్రస్తుత సీఎండీ అతుల్‌భట్ నవంబర్‌లో రిటైర్ అవుతున్నారు.

Similar News

News July 5, 2025

విశాఖ: A.P.E.P.D.C.L. పరిధిలో C.G.R.F సదస్సులు

image

ఈనెల 8 నుండి A.P.E.P.D.C.L. పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (C.G.R.F) సదస్సులు నిర్వహిస్తామని ఛైర్మన్ బి.సత్యనారాయణ తెలిపారు. సంస్థ సెక్షన్ కార్యాలయాల్లో సదస్సులు జరుగుతాయన్నారు. విద్యుత్ వినియోగదారులు నేరుగా సదస్సుల్లో పాల్గొని ఫిర్యాదులు ఇవ్వాలని కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, బిల్లులు తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.

News July 5, 2025

సింహాచలం గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష

image

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. గిరిప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్ సదుపాయాలతోపాటు వైద్య శిబిరాల గురించి చర్చించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ విన్నవించారు.

News July 5, 2025

ఎండాడలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

ఎండాడ జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలను మళ్లీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.