News October 12, 2025

‘విశాఖ స్ఫూర్తితో బాలాజీ రైల్వే డివిజన్‌ సాధించుకుందాం’

image

రాజకీయాలకు అతీతంగా <<17977459>>బాలాజీ రైల్వే డివిజన్‌<<>>ను సాధించుకుందామని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో దీనిపై ఆదివారం సమావేశం జరిగింది. ఇందులో భాగంగా బాలాజీ రైల్వే డివిజన్‌ ఆవశ్యకతను పలువురు నొక్కి చెప్పారు. విశాఖ ఉక్కు స్ఫూర్తితో బాలాజీ రైల్వే డివిజన్ సాధించికుందామని వారు పిలుపునిచ్చారు.

Similar News

News October 12, 2025

వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో మ్యాచ్

image

వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో ఆదివారం డీఆర్ఎం వాల్తేర్ XI వర్సెస్ నేవీ XI మ్యాచ్ మ్యాచ్ జరిగింది. రెండు జట్లు నైపుణ్యం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాయి. ఈ మ్యాచ్‌లో నేవీ XI మొదట బాటింగ్ చేసి 20 ఓవర్లకు 133 రన్స్ చేసింది. ఛేదనలో డీఆర్ఎం వాల్తేర్ XI 17 ఓవర్లలో 134 రన్స్ చేసి మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ భారత రైల్వే, నౌకాదళం మధ్య సంబంధాలను బలోపేతం చేసిందని రెండు వర్గాల అధికారులు పేర్కొన్నారు.

News October 12, 2025

హనీట్రాప్ చేసిన మార్కాపురం యువకుడు

image

సంగారెడ్డి జిల్లా హత్నూర్ PS పరిధిలోని కోనంపేటకి చెందిన విద్యార్థి మనోజ్‌ను ప్రకాశం జిల్లా యువకుడు హనీట్రాప్ చేశాడు. అనంతరం అతనివద్ద నుంచి రూ.11,20,000 వసూలు చేసిన ఘటనలో మార్కాపురం యువకుడు సంజయ్ సహా పలువురిని సంగారెడ్డి సీసీయస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతితో కలిసి న్యూడ్ వీడియో కాల్స్ చేయించి బ్లాక్మెయిల్ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News October 12, 2025

రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు: APSDMA

image

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. సోమవారం అల్లూరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.