News April 13, 2025
విశాఖ: స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖ జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ 2025-26 ఆర్ధిక సంవత్సరంకు ఎస్.సి.నిరుద్యోగ యువతకు 16.88 కోట్ల రూపాయలతో వివిధ స్వయం ఉపాధి పథకాలను అమలు చేయడానికి ఆమోదం తెలిపిందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. https://apobmms.apcfss.in లో ఏప్రిల్ 14నుంచి మే 10లోపు బిపిఎల్ కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు వెబ్సైట్‌లో చూడాలని అన్నారు.
Similar News
News April 13, 2025
విశాఖలో కళారూపాల శంఖారావం

అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం పేరుతో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలో కళాకారులతో కళారూపాల శంఖారావం నిర్వహించారు. విశాఖ ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన శంఖారావం ర్యాలీని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
News April 13, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: విశాఖ కలెక్టర్

ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంబేడ్కర్ జయంతి సందర్భంగా రేపు(ఏప్రిల్14న) రద్దు అయినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ ఆదివారం తెలిపారు. ప్రభుత్వం అంబేడ్కర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించడంతో ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ ఆఫీస్‌తో పాటు, జీవీఎంసీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న పీజీఆర్ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
News April 13, 2025
విశాఖ మీదుగా వెళ్లే రైళ్ల దారి మళ్లింపు

ఖుర్దా డివిజన్‌లో ఇంటర్ లాకింగ్ పనుల వలన విశాఖ మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ ఆదివారం తెలిపారు. ఈనెల16 నుంచి 23వరకు విశాఖ -హిరకుడ్(20807/08), భువనేశ్వర్ – LTT (12879/80), (22865/66), (20471/72), (20823/24), (22827/28), (20861/62) నంబర్ గల రైళ్లు విజయనగరం, తిట్లాఘర్, సంబల్పూర్ మీదుగా ఝార్సుగూడ చేరుకుంటాయన్నారు.