News December 10, 2024
విశాఖ: హస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు పరార్
అల్లిపురం మహారాణిపేట పోలీసు పరిధి, అంథోని బోర్డింగ్ హోమ్ నుంచి నలుగురు విద్యార్థులు పరారైనట్లు హోమ్ ఇన్‌ఛార్జ్ కచ్చా వేళంగిరి ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రార్థనలకు చర్చికి వెళ్లిన గుడాల రఘ, బెడపాటి చరణ్, నక్కాల కిరణ్ కుమార్, కార్తీక్ సాయంత్రం అయిన రాలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా గోడ దూకి పారిపోయినట్లు గుర్తించారు. విశాఖ ఆర్టీసీ బస్టాండ్, రైల్వే, ఆర్కే బీచ్ తదితర ప్రాంతాల్లో వెదికారు.
Similar News
News December 26, 2024
విశాఖ: ‘మద్యం మత్తులో ఆటో డ్రైవర్ మృతి’
పనోరమ హిల్స్ వద్ద మద్యం మత్తులో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. మర్రిపాలెంకు చెందిన ఎస్.నాగేశ్వరరావు(38) ఆటోలో కేటరింగ్ సామాన్లు తీసుకువచ్చి అనుమాస్పద స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతిపై ఎలాంటి అనుమానం లేదని..అతిగా మద్యం తాగిన కారణంగానే అతను మరణించినట్లు పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపారు.
News December 26, 2024
ఇది సార్ వైజాగ్ బ్రాండ్..!
వైజాగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన బీచ్‌లు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ కారణంగా రాష్ట్రంలో తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలమైనా విశాఖలో బీచ్‌లు చెక్కుచెదరలేదు. రాకాసి అలలు కృష్టా జిల్లాలో 27, నెల్లూరులో 20, ప్రకాశంలో 35 మందిని బలితీసుకోగా.. విశాఖలో ఒక్క ప్రాణం కూడా పోలేదు. దీనికి కారణం ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధంగా సముద్రంలోకి చొచ్చుకొచ్చే కొండలు, డాల్ఫిన్స్ నోస్.
News December 26, 2024
విశాఖ హనీట్రాప్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
విశాఖ హనీట్రాప్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ బుధవారం తెలిపారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా ఉస్మాన్ చౌదరి, ఆమె భర్త తన్వీర్, అవినాశ్, వారి స్నేహితుడు బెంజిమన్ పాత్ర ఉన్నట్లు రుజువు కావడంతో వారిని కంచరపాలెం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరు జాయ్ జమీమా బృందానికి మత్తుమందులు, స్ప్రేలు సరఫరా చేసేవారని పేర్కొన్నారు.