News December 22, 2025

విశాఖ: హెల్మెట్ లేదా? ‘అయితే పెట్రోల్ లేదు’

image

విశాఖలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ‘నో హెల్మెట్ – నో ఫ్యూయల్’ (No Helmet – No Fuel) విధానాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ ఏడీసీపీ కే.ప్రవీణ్ కుమార్ చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోస్తారని స్పష్టం చేశారు. వాహనదారుల ప్రాణ రక్షణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News December 31, 2025

విశాఖలో మూడు స్టాండింగ్ కమిటీల పర్యటన

image

విశాఖలో రైల్వే, వాణిజ్య, రక్షణ శాఖలకు చెందిన 3 పార్లమెంటు స్టాండింగ్ కమిటీలు జనవరిలో పర్యటించనున్నాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కమిటీల ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాల‌ని, ఎలాంటి లోపాలు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని సూచించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ అధికారులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News December 31, 2025

విశాఖ: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

విశాఖలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భోగాపురం ప్రాంతానికి చెందిన నర్సింగ్ వన్‌టౌన్ పరిధిలో ఉంటున్నాడు. ఈ ఏడాది మార్చిలో అదే ప్రాంతంలో ఉంటున్న 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. నేరం రుజువు కావడంతో కోర్టు పైవిధంగా శిక్షను విధిస్తూ మంగళవారం తీర్పు నిచ్చింది.

News December 31, 2025

విశాఖ: రేషన్ షాపుల్లో రూ.20కే కిలో గోధుమ పిండి!

image

జిల్లాలోని పట్టణ ప్రాంత రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం దృష్ట్యా జనవరి 2, 2026 నుంచి కార్డుకు కిలో చొప్పున గోధుమ పిండిని కేవలం రూ.20లకే పంపిణీ చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.45 నుంచి రూ.80 వరకు ఉన్న పిండిని సబ్సిడీ ధరకే అందిస్తున్నారు. పోషకాలతో కూడిన ఈ గోధుమ పిండిని లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.