News March 8, 2025
విశాఖ: హోటల్లో మహిళ అనుమానాస్పద మృతి

నగరంలోని ఓ హోటల్లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఈమె మేఘాలయ హోటల్లో రూమ్ తీసుకొని ఉరివేసుకొని మృతి చెందగా యాజమాన్యం ఫిర్యాదు మేరకు శనివారం అనుమానాస్పద కేసు నమోదు చేశారు. ఈమె ఎవరు ఎలా మృతి చెందింది అనే విషయం తేలాల్సి ఉంది. రిటన్ సీఐ రమణయ్య ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 9, 2025
విశాఖ: రేపటి నుంచి యథావిధిగా పీజీఆర్ఎస్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) వినతుల స్వీకరణ కార్యక్రమం 10వ తేదీ నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా గత కొన్ని వారాల నుంచి రద్దైన సంగతి తెలిసిందే. కోడ్ ముగిసిన క్రమంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 9, 2025
ద్వారకానగర్‌లో యువతి ఆత్మహత్య

ద్వారకానగర్‌లో ఓ యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ప్రమీల(20) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదివారం ఉదయం రూములో ఉరివేసుకుని చనిపోయింది. యువతి తండ్రి రామినాయుడు ద్వారకానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరి సమాచారం మేరకు ద్వారకానగర్ ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News March 9, 2025
మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి: హోం మంత్రి

సమాజంలో మహిళలు ఎప్పుడూ మహారాణులు గానే నిలుస్తారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితా అన్నారు. ఆదివారం ఏపీ గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు గంగాభవాని, కార్యదర్శి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఆంధ్ర మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో హోం మంత్రి అనిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఎప్పుడో మహారాణులుగా నిలుస్తారన్నారు.