News March 10, 2025
విశాఖ హోటల్‌లో మహిళ మృతి.. నిందితుడు అరెస్ట్

విశాఖలోని ఓ హోటల్‌లో <<15698756>>మహిళ ఉరి<<>> వేసుకున్న ఘటనలో నిందితుడిని త్రీటౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. విశాఖలో ఉంటున్న పిళ్ల శ్రీధర్ (53)USAలో ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నారు. అక్కడ ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె ఫిబ్రవరి 14న విశాఖ వచ్చింది. మార్చ్ 6న హోటల్ మేఘాలయలో కలవాలని అతను బలవంతం చేశాడు. హోటల్‌లో శ్రీధర్ ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని దీంతో ఆమె ఉరి వేసుకుందని విచారణలో తేలింది.
Similar News
News March 10, 2025
భీమిలి: గుండెపోటుతో టీచర్ మృతి

భీమిలి జూనియర్ కాలేజీలో ఇంటర్ ఇన్విజిలేటర్ గా ఉన్న డి.మాధవరావు(55) పరీక్షా కేంద్రంలోనే గుండెపోటుతో మృతి చెందాడు. రేకవానిపాలెం ఎంపీపీ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఆయనకు ఇంటర్ ఇన్విజిలేషన్ విధులు అప్పగించారు. ఈమేరకు సోమవారం ఉ.8గంటలకు పరీక్షా కేంద్రంలో ఆయన కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News March 10, 2025
విశాఖలో నేటి కూరగాయ ధరల వివరాలు

విశాఖలోని వ్యవసాయ, వాణిజ్య శాఖ అధికారులు సోమవారం నాటి కూరగాయ ధరలను విడుదల చేశారు. వాటి వివరాలు టమోటా కేజీ రూ.14 , ఉల్లిపాయలు కేజీ రూ.28 , బంగాళాదుంపలు కేజీ రూ.15, వంకాయలు రూ.22/24/32, బెండకాయలు రూ.44, మిర్చి రూ.24, బరబాటి రూ.36, క్యారెట్ రూ.24, బీరకాయలు రూ.50, వెల్లుల్లి రూ.60/80/90గా నిర్ణయించారు.
News March 10, 2025
వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తాం: విశాఖ సీపీ

విశాఖ సీపీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో అల్లిపురానికి చెందిన ప్రధాన నిందితుడు నానాబల్ల గణేశ్వరరావును ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతను మధ్యవర్తిగా బెట్టింగ్ లావాదేవీలు జరపుతుంటాడని పేర్కొన్నారు. వీరి ద్వారా ఇంకొందరు బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.