News December 24, 2025
విశాఖ: 13 ఏళ్ల క్రితం మహిళ మిస్సింగ్.. కేసును చేధించిన పోలీసులు

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో పాత కేసులను రీ-ఓపెన్ చేసిన పోలీసులు ఓ మిస్సింగ్ కేసును చేధించారు. 2012లో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చుక్క కుమారి అదృశ్యమయ్యారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ చేసి సాంకేతిక ఆధారాలతో ఆమెను తెలంగాణలో గుర్తించారు. 13 ఏళ్ల తర్వాత ఆమెను క్షేమంగా తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ టీ.కామేశ్వరరావు తెలిపారు.
Similar News
News February 20, 2026
విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు భూసేకరణ పూర్తి

విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారే దిశలో మరో భారీ అడుగు పడింది. నగర సమీపంలో ప్రతిపాదిత గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం 308 ఎకరాలకు పైగా భూసేకరణను ఏపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో సాంకేతిక పెట్టుబడులు పెరగడమే కాకుండా, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖను గ్లోబల్ టెక్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.
News February 19, 2026
టెక్నాలజీతో నిఘా.. ‘అస్త్రం’ యాప్‌తో ట్రాఫిక్ నియంత్రణ

విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ బందోబస్తును పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి స్వయంగా పర్యవేక్షించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, ‘అస్త్రం’ & ‘ఈ-పాత్’ యాప్‌ల సాయంతో భద్రతను పగడ్బందీగా నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకను విజయవంతం చేసిన సిబ్బందిని సిపీ అభినందించారు. పోలీసులకు సహకరించిన నగర ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News February 19, 2026
విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

విశాఖలో జరుగుతున్న ఐఎఫ్ఆర్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం విశాఖ వచ్చారు. ఆయనకు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పలువురు నేవీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖలో ఐఎఫ్ఆర్ వేడుకల్లో పాల్గొని సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.


