News August 19, 2025
విశాఖ: 20 నుంచి 24 వరకు కోర్టు ఉద్యోగాలకు పరీక్షలు

విశాఖలోని న్యాయ స్థానాల్లో సిబ్బంది నియామకానికి ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులంతా ఈ పరీక్షలకు 15 నిమిషాల ముందుగానే హాజరు కావాలన్నారు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించి పరీక్షకు హాజరుకావాలని సూచించారు.
Similar News
News August 20, 2025
వినాయక చవితి భద్రత, మార్గదర్శకాలపై అధికారులతో సీపీ సమావేశం

వినాయక చవితి భద్రతా మార్గదర్శకాలపై కోఆర్డినేషన్ మీటింగ్‌ను పోలీసు కమిషనర్ శంఖబ్రాత బాగ్చి మంగళవారం నిర్వహించారు. వినాయక మండపాల వద్ద విద్యుత్, అగ్నిప్రమాద నివారణ చర్యలు, సీసీ కెమెరాలు, వాలంటీర్ల నియామకం, నిమజ్జనానికి గుర్తించిన ప్రదేశాల వినియోగం తప్పనిసరి. డ్రోన్లతో నిఘా, డొనేషన్ల బలవంతం, DJ, మత్తుపదార్థాలపై నిషేధం తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News August 20, 2025
విశాఖ నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ సూచన

ఇటీవల ఎన్నికైన జీవీఎంసీ స్థాయి సంఘం సభ్యులు మంగళవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కమిషనర్ సభ్యులను అభినందిస్తూ, నగరంలోని ప్రతి అభివృద్ధి పనిపై స్థాయి సంఘంలో సమగ్రంగా చర్చించి ఆమోదం తెలుపడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని అన్నారు. నగర అభివృద్ధిలో సంఘం కీలక పాత్ర పోషించాలని సూచించారు.
News August 19, 2025
30న విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశం

ఈనెల 30న విశాఖలోని మున్సిపల్ స్టేడియం వేదికగా జనసేన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం విశాఖలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యకర్తల సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని, ఈ సభనుంచి కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు.