News November 20, 2025

విశాఖ: ‘2025-26 సంవత్సరానికి కాఫీ కొనుగోలు ధరల ప్రకటన’

image

2025-26 సంవత్సరానికి కాఫీ కొనుగోలు ధరలను విశాఖలో జరిగిన సమవేశంలో అపెక్స్ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. అరెబికా పార్చ్‌మెంట్ రకం (KG) రూ.450, అరెబికా చెర్రీ రూ.270, రోబస్టా చెర్రీ కాఫీ రూ.170 చొప్పున నిర్ణయించారు. గిరిజన కాఫీ రైతుల సంక్షేమం కోసం ధరలను పెంచామన్నారు. ఈ విషయాన్ని పాడేరు ఏజెన్సీలోని గిరిజన కాఫీ రైతులందరికీ విస్తృత అవగాహన కల్పించాలని GCC సిబ్బందిని అధికారులు ఆదేశించారు.

Similar News

News November 22, 2025

“తూర్పు”లో టెన్త్ రాయనున్న 26,619 విద్యార్థులు

image

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ కె.వాసుదేవరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 26,619 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివి విజయం సాధించాలని డీఈఓ సూచించారు.

News November 22, 2025

NLG: వాట్సప్‌తో ఇక మీ సేవలు..!

image

నల్గొండ జిల్లా ప్రజలకు అతి ముఖ్యమైన మీ-సేవ సేవలు మరింత సులభతరమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. జిల్లాలో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా అన్ని రకాల అవసరాల కోసం వివిధ సర్టిఫికెట్స్ పొందడానికి ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా మీ సేవలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తోంది. ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు కొత్త డిజిటల్ సేవలను ప్రారంభించారు.

News November 22, 2025

వరంగల్: ఖాళీ డీఐజీ భవనానికి కాపలా..!

image

వరంగల్ రేంజ్ DIG పోస్టు ఖాళీగా ఉంది. గతంలో వరంగల్ రేంజ్ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, WGL, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉండే SIలు, CIలపై పర్యవేక్షణ ఉండేది. తెలంగాణ ఏర్పడిన అనంతరం చిన్న జిల్లాలుగా మారడం, ఆ తర్వాత కమిషనరేట్లు రావడంతో DIG పోస్టు ఖాళీ అయ్యింది. ప్రస్తుతం మల్టీ జోన్ ఐజీ, WGL సీపీ ఇన్‌ఛార్జిలుగా ఉంటున్నారు. ఈ పోస్టు ఖాళీగా ఉన్నా, సుబేదారిలోని రెండెకరాల భవనానికి పోలీసులు కాపలా ఉంటున్నారు.