News March 30, 2025
విశాఖ: 9 మంది పోలీస్ సిబ్బందికి వీడ్కోలు పలికిన సీపీ

విశాఖ నగర పోలీసు శాఖలో విధులు నిర్వర్తించిన 9 మంది పోలీస్ సిబ్బంది శనివారం పదవీ విరమణ చేశారు. వారికి విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి వీడ్కోలు పలికారు. పోలీస్ శాఖలో 40 ఏళ్ళకు పైగా సర్వీస్ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. రిటైర్మెంట్ జీవితం హాయిగా గడపాలని కోరారు. రిటైర్డ్ అయిన వారిలో ఎస్‌ఐలు, ఏఆర్‌ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్‌సి, ఎఆర్‌హెచ్‌సీ, పీసీలు ఉన్నారు.
Similar News
News April 1, 2025
విశాఖ: పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

విశాఖలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. జీవీఎంసీ జోన్-4 జేఎస్ఎం కాలనీలో పలువురు లబ్ధిదారులకు కలెక్టర్ పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మౌలిక వసతులపై ఆరా తీశారు. ఈరోజు సాయంత్రంలోగా శతశాతం పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News April 1, 2025
విశాఖ వస్తున్న యుద్ధ నౌకలు

భారత్, అమెరికా సంయుక్తంగా విశాఖలో ఇవాళ్టి నుంచి టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు చేయనున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ తదితర అంశాల్లో పరస్పర సహకారంలో భాగంగా ఇరు దేశాలు ఈ విన్యాసాలు చేపడుతున్నాయి. 13 రోజుల పాటు బంగాళాఖాతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే 2 యుద్ధ నౌకలు విశాఖకు తరలివస్తున్నాయి. ఇరు దేశాల వైస్ అడ్మిరల్, రియల్ అడ్మిరల్ స్థాయిలో పరస్పర చర్చలు జరగనున్నాయి.
News April 1, 2025
జీవీఎంసీకీ ఆస్తి పన్ను రూపంలో రూ.510 కోట్లు

గ్రేటర్ విశాఖలో రూ.510కోట్లు ఆస్తిపన్ను వసూళ్లు అయినట్లు కలెక్టర్&ఇన్‌ఛార్జ్ కమీషనర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పన్నులు చెల్లించిన ప్రజలకు, వసూళ్లలో పాల్గొన్న జోనల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. 2023-24 సంవత్సరంకు గాను రూ.454కోట్లు వసూళ్లు చేయగా.. 2024-25లో రూ.510కోట్లు వసూళు చేయడం హర్షనీయమన్నారు.