News October 30, 2024
విశాఖ: NAD ఫ్లైఓవర్‌పై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

NAD ఫ్లైఓవర్‌పై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులు లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్ లారీ కిందకు వెళ్లిపోయింది. ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని కేజీహెచ్‌కు తరలించారు.
Similar News
News December 29, 2025
‘సంజీవని నిధి’కి విరాళాలు ఇవ్వండి.. విశాఖ కలెక్టర్ విజ్ఞప్తి

విశాఖ జిల్లాలోని పేదలకు, బాధితులకు అండగా నిలిచేందుకు ‘సంజీవని నిధి’కి స్వచ్ఛంద విరాళాలు అందించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో పూలు, కేకులు, బహుమతులకు బదులుగా మానవత్వంతో ఈ నిధికి సాయం చేయాలని కోరారు. ఆసక్తి గల దాతలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతా (50100500766040, IFSC: HDFC0009179) ద్వారా విరాళాలు అందించి సామాజిక బాధ్యతను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
News December 29, 2025
సింహాచలంలో వైకుంఠ ద్వారం దర్శనానికి ఏర్పాట్లు పూర్తి

సింహాచలంలోని వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనం కలిగించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసామని ఆలయ ఈవో సుజాత ఏఈఓ తిరుమలేశ్వర్ రావ్ తెలిపారు. దేవస్థానం సిబ్బంది పోలీస్ శాఖ సమన్వయంతో భక్తులకు దర్శన ఏర్పాట్లు పార్కింగ్ వసతి అన్నిచోట్ల అందుబాటులో ఉండేలా చేశామన్నారు. అన్న ప్రసాద వితరణ అదనంగా చేపడుతున్నామని తెలిపారు
News December 29, 2025
వైజాగ్‌లో న్యూ ఇయర్ వేడుకలు.. కఠిన రూల్స్!

విశాఖలో న్యూఇయర్ వేడుకల కోసం పోలీస్ కమిషనర్ కఠిన మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈవెంట్లకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని.. పబ్స్, హోటళ్లలో CCTV కెమెరాలు, భద్రత ఉండాలని పేర్కొన్నారు. డ్రగ్స్, అశ్లీలతకు తావులేకుండా వేడుకలు జరుపుకోవాలని చెప్పారు. మహిళల రక్షణ కోసం ‘శక్తి టీమ్స్’ అందుబాటులో ఉంటాయని.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ.10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.


