News October 25, 2025
విశాఖ: YCPలో 8%.. కూటమిలో 10 పర్సంట్?

GVMC స్టాండింగ్ కమిటీలో <<18099541>>కమీషన్<<>>ల పర్వం నడుస్తోందట. పలు అంశాల ఆమోదం కోసం కొందరు సభ్యులు కాంట్రాక్టర్ల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. పర్సంటేజీలు ఇస్తేనే పని అవుతుండడంతో కాంట్రాక్టర్లు బిల్లుల్లో భారీగా రేట్లు చూపిస్తున్నారని విమర్శలున్నాయి. EX: రూ.600 డ్రమ్ముకు రూ.2000 బిల్లు వేసిన ఘటనలున్నాయి. ఈ కమీషన్ YCP పాలనలో 8% ఉంటే కూటమిలో 10% పెరిగిందని కాంట్రాక్టర్ల వర్గాల ఆరోపణ.
Similar News
News October 25, 2025
NRPT: ధన ధాన్య పథకం రైతులకు వరం: దత్తాత్రేయ

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధినే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుని ప్రధాని మోదీ పని చేస్తున్నారని తెలిపారు. దేశంలోని 100 వెనుకబడిన జిల్లాల్లో “ధన ధాన్య” కార్యక్రమం ప్రారంభించామని, అందులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మూడు జిల్లాలు ఎంపికయ్యాయని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.
News October 25, 2025
చిమ్మిరిబండలో వీఆర్వో మృతి

మార్టూరు మండలం చిమ్మిరిబండలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న పి శామ్యూల్ శనివారం మృతి చెందారు. తాను కొన్ని రోజులుగా మార్టూరులో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. ఆ ఇంట్లో ఉదయం బట్టలు లేకుండా మృతి చెందినట్లు గుర్తించారు. ఏఎస్సై మహమ్మద్ బాషా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
News October 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 46 సమాధానాలు

1. రామాయణంలో జటాయువు సోదరుడి పేరు ‘సంపాతి’.
2. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికిన పర్వతం ‘మందరం’.
3. నాగుల చవితి కార్తీక మాసంలో వస్తుంది.
4. ఇంద్రుడి గురువు ‘బృహస్పతి’.
5. అష్టదిక్పాలకులలో ఉత్తర దిక్కును పాలించేది ‘కుబేరుడు’.
<<-se>>#Ithihasaluquiz<<>>


