News February 15, 2026
విశ్వేశ్వర సముద్రమే.. నేటి ధర్మసాగరం!

జలకళతో అలరారుతున్న ధర్మసాగరం చెరువుకు ఘనమైన చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నాటి శాసనాల ప్రకారం.. ఈ చెరువును అప్పట్లో ‘విశ్వేశ్వర సముద్రం’గా పిలిచేవారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. కాకతీయ చక్రవర్తులు నిర్మించిన గణప సముద్రం, కేశరి సముద్రం తరహాలోనే దీనికి కూడా శాసనాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయుల నీటి యాజమాన్య పద్ధతులకు, వారి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ చెరువు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
Similar News
News February 17, 2026
ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్

బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులోని అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆనంద్ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు నమిలి మింగాలని సూచించారు. సంవత్సరంలో రెండు సార్లు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల నులిపురుగులు నశిస్తాయని తెలిపారు. పలువురు విద్యార్థులు ఇక్కడికి చేరుకొని మాత్రలు స్వీకరించారు.
News February 17, 2026
BREAKING: ఐబొమ్మ రవికి బెయిల్

TG: ఐబొమ్మ నిర్వాహకుడు రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజూ ఉ.11 గంటలకు సీపీఎస్ పోలీసుల ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్ పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. కోర్టు అనుమతితోనే ఇంటర్నెట్ వాడాలని తేల్చిచెప్పింది. సినిమాల పైరసీ కేసులో గతేడాది నవంబర్ 16న రవి అరెస్టయిన విషయం తెలిసిందే.
News February 17, 2026
చెస్ పోటీలు ప్రారంభించిన కలెక్టర్, ఎంపీ

అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో శాప్ లీగ్–2026 చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ ఆనంద్ హాజరై వీటిని ప్రారంభించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. జిల్లా నుంచి ప్రతిభావంతులు వెలుగులోకి రావాలన్నారు. పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఇక్కడికి చేరుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు.


