News April 9, 2025

విషాదం.. ఎల్లెల్సీలో ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు అనుమేశ్ ఎల్లెల్సీలో ఈతకు వెళ్లి మృతి చెందడంతో చిన్నకడబూరుకు చెందిన తల్లిదండ్రులు హనుమంతు, నాగలక్ష్మి శోకసంద్రంలో మునిగిపోయారు. ఎల్లెల్సీ పక్కన ఉన్న తమ పొలంలో పని చేసుకుంటున్న తల్లిదండ్రులకు కుమారుడి మృతి విషయం గుండెపగిలేలా చేసింది. పుట్టుకతో అనుమేశ్‌కు మాట రాకపోయినా కంటికి రెప్పలా కాపాడుకున్నామని తండ్రి హనుమంతు రోదించారు.

Similar News

News February 9, 2026

కసిరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

image

AP: సుప్రీంకోర్టులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు SC ధర్మాసనం నిరాకరించింది. రూ.750 కోట్ల కుంభకోణంలో 9నెలలుగా జైలులో ఉండటం పెద్ద సమయమేమీ కాదని CJI జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ స్కామ్‌లో ఎన్ని రూ.కోట్లు సంపాదించారని ప్రశ్నించారు. వాదనలు వినిపించేందుకు కసిరెడ్డి తరఫు న్యాయవాది సమయం కోరడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు.

News February 9, 2026

జనగామ: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జనరల్ అబ్జర్వర్ నర్సింహా రెడ్డి సమక్షంలో నిర్వహించారు. జనగాం మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 66 పోలింగ్ స్టేషన్స్‌కి 20% రిజర్వ్‌తో POలు 80 మంది, APOలు 80, OPOలు240, స్టే.ఘ.లో 18 వార్డుల్లో 36 పోలింగ్ స్టేషన్స్‌కి 20% రిజర్వ్‌తో POలు 44 మంది, APOలు 44, OPOలు 132 మందిని నియమించారు.

News February 9, 2026

మంచిర్యాల: 2 రోజులు పాఠశాలలకు సెలవులు

image

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మంగళవారం, బుధవారం సెలవులు ప్రకటిస్తూ డీఈఓ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్, మున్సిపల్ కార్పోరేషన్లకు 2వ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం భవనాలు, సిబ్బంది నిర్వహణ కోసం సెలవులు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సెలవుల భర్తీ కోసం ఈ నెల 2వ శనివారం, వచ్చే నెల 2వ శనివారం పాఠశాలలు పనిదినాలుగా ప్రకటించారు.