News September 2, 2024
విషాదం.. పంట మునిగిందని రైతు ఆత్మహత్యాయత్నం

వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాతలకూ కష్టాలు తప్పడం లేదు. ఈక్రమంలో ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రాజుపాలెం మండలం అనుపాలేనికి చెందిన పగిల్ల గోపి కౌలుకు తీసుకుని మూడెకరాల్లో పైరు సాగు చేశారు. వరద నీటిలో పంట మునిగిపోయింది. దీనికి తోడు పాత అప్పులు ఉండటంతో బాధ తట్టుకోలేక గడ్డిమందు తాగాడు. సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Similar News
News January 7, 2026
అమరావతిలో తొలి భూ సేకరణ నేటి నుంచే..!

అమరావతిలో తొలిసారి భూసేకరణ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి పూలింగ్‌కు ఇవ్వని సుమారు 4.5 ఎకరాల భూమిని భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి బుధవారం భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఫిబ్రవరి చివరి నుంచి స్టీల్ బ్రిడ్జీ అందుబాటులోకి రానుండటంతో ప్రజలకు కనెక్టివిటీ అందించేందుకు భూ సేకరణ చేపడుతున్నామని మంత్రి నారాయణ ఇప్పటికే తెలిపారు.
News January 7, 2026
నేడు గుంటూరులో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. చుట్టుగుంటలోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మిర్చి వ్యాపారులు, కమీషన్ ఏజెంట్స్, అధికారులతో మంత్రి సమావేశం అవుతారు. రాబోవు మిర్చి సీజన్‌లో మిర్చి యార్డ్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, మిర్చి ధరలు పతనమవ్వకుండా అనుసరించాల్సిన విధివిధానాలపై మంత్రి చర్చించనున్నారు.
News January 7, 2026
GNT: స్పెషల్ ఎట్రాక్షన్‌గా ‘సరస్ అక్క’

ఈ నెల 8 నుంచి గుంటూరు వేదికగా జరగనున్న సరస్ (సేల్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శన, అమ్మకంతో గుంటూరు మిర్చి ఘాటు మరింత బలంగా తాకనుంది. గుంటూరులో మొదటిసారిగా ఈ ప్రదర్శన, అమ్మకాలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా మిర్చికి ప్రసిద్ది కావడంతో సరస్ కార్యక్రమానికి ‘మిర్చి మస్కట్’ రూపొందించారు. ఈ మస్కట్ కి ‘సరస్ అక్క’ అని నామకరణం చేశారు. సీఎం చంద్రబాబు ఈ ప్రదర్శన ప్రారంభించనున్నారు.


