News August 21, 2025
విషాదం.. వేడి పాలు నోటిలో పడి చిన్నారి మృతి

వేడి పాలు చిన్నారి ప్రాణం తీశాయి. ఈ విషాద ఘటన గుత్తి కోటలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ప్రతాప్ రెడ్డి, మేనక దంపతుల కుమారుడు షర్మిల్ రెడ్డి (15 నెలల బాలుడు) వేడి చేసిన పాలను తాగడానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు అవి నోరు, ముక్కులో పడ్డాయి. ఊపిరాడకపోవడంతో మరణించాడు. ఈ ఘటనతో కోటవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News August 21, 2025
సోషల్ మీడియాకు దూరంగా ఉండండి: కలెక్టర్

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో హాస్టల్ నిర్మాణానికి ఆయన గురువారం భూమిపూజ చేశారు. తల్లితండ్రుల కలను నెరవేర్చడమే విద్యార్థుల లక్ష్యమన్నారు. ఓ టార్గెట్ పెట్టుకుని దానిని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. విద్యపై చేసే ఖర్చు ఎప్పటికీ వృథా కాదన్నారు.
News August 21, 2025
అప్పర్, మిడ్ మానేరు డ్యాంల ప్రస్తుత నీటి వివరాలు

అప్పర్ మానేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి 1,482.50 అడుగులకు చేరి 2.00 టీఎంసీలతో నిండి ఉంది. 2,202 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో అంతమొత్తాన్ని స్పిల్‌వే ద్వారా విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరు జలాశయం 312.58 మీటర్ల వద్ద 15.63 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 18,380 క్యూసెక్కుల ప్రవాహం రాగా, 3,310 క్యూసెక్కుల నీటిని ప్యాకేజీల ద్వారా విడుదల చేస్తున్నామని అధికారులు గురువారం ఉదయం తెలిపారు.
News August 21, 2025
ఏలూరు: వరద ముప్పు.. మూటాముళ్లే సర్దుకొని పయనం

ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు ఏజెన్సీ మండలాల్లో గోదావరి వరద ఉధృతి పెరగడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి పరిస్థితిని పరిశీలిస్తూ, ముంపు ప్రభావిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రేపాకుగోమ్ము గ్రామంలో నిర్వాసితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పంట పొలాలు, రహదారులు, వంతెనలు నీటమునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.