News January 28, 2025

విషాదం: హుస్సేన్‌సాగర్‌‌లో మృతదేహం లభ్యం

image

హుస్సేన్‌సాగర్‌‌లో అజయ్ మృతదేహం లభ్యమైంది. ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన నాగారం వాసి అజయ్ కోసం కోసం DRF, NDRF దాదాపు 45 గంటలు గాలించాయి. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని వెలికితీశాయి. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒకరు మృతి చెందారు. భారత మాత హారతి కార్యక్రమంలో టపాసులు కాల్చుతుండగా ప్రమాదం జరగగా పలువురు గాయపడ్డారు. తప్పించుకునే క్రమంలో అజయ్ నీటిలో దూకేసినా ప్రాణాలు దక్కకపోవడం బాధాకరం.

Similar News

News December 29, 2025

మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోతున్నారా?

image

AP: చాలా మంది దోమల నుంచి రక్షణకు మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోతుంటారు. అయితే దీనివలన ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అనిల్‌కుమార్ తన తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి ఇంట్లో నిద్రపోతుండగా మస్కిటో కాయిల్ దుప్పటికి అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిర్లక్ష్యం చేయకుండా నిద్రకు ముందు కాయిల్ ఆర్పివేయడం లేదా బెడ్‌కు దూరంగా ఉంచుకోవాలి.

News December 29, 2025

వరంగల్: యూరియా యాప్ డౌన్..!

image

జిల్లా రైతులకు యూరియా యాప్ సరిగా పని చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాప్ ఓపెన్, డేటా లోడ్ కాకపోవడంతో యూరియా నమోదు, స్లిప్ పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఈ సమస్య వల్ల ఎరువుల పంపిణీ ఆలస్యం అవుతుండటంతో రైతులు అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News December 29, 2025

తిరుపతి: ఆ భక్తుల పరిస్థితి ఏంటో..?

image

వైకుంఠ ఏకాదశి సమయంలో తమిళనాడు భక్తులు పాదయాత్రగా తిరుమలకు ఎక్కువ సంఖ్యలో చేరుకుంటారు. టీటీడీ ఎన్ని అవగాహన ప్రకటనలు చేసినా వారు మాత్రం తిరుపతికి చేరుకుని నిరసనలకు దిగిన ఘటనలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి మొదటి మూడు రోజులు టోకెన్లు లేకుండా వచ్చే భక్తులను TTD, పోలీసులు ఎలా నిలువరిస్తారో చూడాలి మరి.