News December 21, 2024

విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోండి: జడ్పీ చైర్‌పర్సన్

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యా ప్రమాణాల స్థాయి పెంచే విధంగా విద్యా శాఖాధికారులు కృషి చేయాలనీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ చెప్పారు. శనివారం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ వెట్రి సెల్వీ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు నియంత్రణకు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో విష జ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మాతా శిశు మరణాలు లేకుండా చూడాలన్నారు.

Similar News

News December 22, 2024

యువత జాతీయ స్థాయిలో రాణించాలి: కలెక్టర్

image

ఈ నెల 27న నిర్వహించే జిల్లా యువ ఉత్సవాల్లో యువత తమ ప్రతిభ పాటవాలను నిరూపించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ, జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఉత్సవ్ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు.

News December 21, 2024

భీమవరంలో పలు రైస్ మిల్లు తనిఖీలు నిర్వహించిన కలెక్టర్

image

పీడీఎస్ బియ్యం అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. శనివారం భీమవరం మండలం నరసింహపురం వద్ద పలు రైస్ మిల్లులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.

News December 21, 2024

తణుకు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

తణుకు జాతీయ రహదారిపై డిమార్ట్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారి అడ్డగర్ల సుబ్రహ్మణ్యం (45) బైక్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతదేహం నుజ్జునుజ్జైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.