News October 10, 2025

విహారి, ఆంధ్రా లేబరు పత్రికలకు ఆయనే సంపాదకులు

image

తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి ఆగస్టు 10, 1918న ఉమ్మడి గుంటూరు జిల్లా అమృతలూరు మండలం యలవర్రులో జన్మించారు. రాడికల్ రాజకీయాలలో అటు కమ్మూనిస్ట్‌లను, ఇటు కాంగ్రెస్ వారిని ఎదురుకొని, తన ధారాళ ఉపన్యాసాలతో జనాన్ని ఆకట్టుకున్నారు. ములుకోల, ప్రజామిత్ర, సమీక్ష పత్రికలలో వ్యాసాలు రాశారు. విహారి, ఆంధ్రా లేబరు పత్రికలకు సంపాదకత్వం వహించారు.

Similar News

News October 10, 2025

ఆయన ఇలాంటి పాత్ర ధరించినా దానికి న్యాయం చేశారు

image

ముదిగొండ లింగమూర్తి (అక్టోబర్ 10, 1908-జనవరి 24,1980) గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన పాతతరం నటుడు. నాటకరంగం మీద అన్ని రకాల పాత్రలూ ధరించి, పేరుతెచ్చుకుని, సినిమా రంగంలో ప్రవేశించారు. వాహిని సంస్థ నిర్మించిన తొలి చిత్రం వందేమాతరం సినిమాతో పేరు తెచ్చుకున్నారు. క్రూరపాత్ర ధరించినా, అక్రూరపాత్ర ధరించినా, హాస్యపాత్ర ధరించినా నటనలో దేనికదే భిన్నంగా ఉండేది.

News October 10, 2025

GNT: మిర్చీ యార్డులో 53,371 మిర్చి టిక్కీల అమ్మకం

image

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 54,252 మిర్చి టిక్కీలు విక్రయానికి రాగా ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 53,371 అమ్మకం జరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ఇంకా యార్డులో 10,401 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు సంబంధించిన ధరలు పలు విధాలుగా నమోదయ్యాయి.

News October 10, 2025

‘శక్తి’ కాల్స్‌పై సత్వరమే స్పందించాలి: SP

image

GNT SP వకుల్ జిందాల్ గురువారం SP కార్యాలయంలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో నైపుణ్యం కలిగి, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించే సిబ్బందిని అందుబాటులో ఉంచాలని SP సూచించారు. PGRS ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా, శక్తి కాల్స్ వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సత్వరమే స్పందించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.