News September 14, 2025
వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వండి.. జగ్గారెడ్డికి వినతిపత్రం

జీవో నంబర్ 81 ప్రకారం మిగిలిపోయిన వీఆర్‌ఏ వారసులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ వీఆర్‌ఏలు ఆదివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇంకా 61 మందికి ఉద్యోగాలు రాలేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని జగ్గారెడ్డి వారికి హామీ ఇచ్చారు.
Similar News
News September 14, 2025
అమలాపురం ఎంపీకి 4వ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో అమలాపురం ఎంపీ గంటి హరీశ్ నాలుగో స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 77 ప్రశ్నలు అడగటంతో పాటు 13 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 98.35గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
News September 14, 2025
వనపర్తి: బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గిరిధర్ హెచ్చరించారు. ప్రేమ పేరుతో 18 ఏళ్ల లోపు బాలికలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. బాలల సంరక్షణ కోసం 24 గంటల హెల్ప్‌లైన్ నెంబర్ ‘1098’ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.
News September 14, 2025
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్ సోనారిక

టాలీవుడ్ హీరోయిన్ సోనారిక శుభవార్త చెప్పారు. తాను తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు SMలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా సోనారిక తెలుగులో జాదుగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో నటించారు. 2022లో తన ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్ పరశార్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారు పెళ్లి చేసుకున్నారు.